వాళ్లు బంగార్రాజును లైట్‌ తీసుకుంటారా?

నాగార్జున మరియు నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న బంగార్రాజు సినిమా పై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

 Nagarjuna Bangarraju Movie Release For Sankranti Details, Bangarraju, Nagarjuna-TeluguStop.com

ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చేసింది.ఒకటి రెండు రోజుల్లో గుమ్మడి కాయ కొట్టేయబోతున్నారు.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటల విడుదల జరిగింది.ఇక సినిమా చిత్రీకరణ ముగిసిన వెంటనే విడుదల తేదీ ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు బంగార్రాజు టీమ్‌ నుండి అధికారిక ప్రకటన అయితే రాలేదు.ఇద్దరు అక్కినేని హీరోలు నటించిన కారణంగా ఖచ్చితంగా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయిన ఆర్ ఆర్‌ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమా లకు ఇది ఎఫెక్ట్‌ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బంగార్రాజు కనుక సంక్రాంతికి వస్తే పరిస్థితి ఏంటీ అనేది కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను మరియు పవన్ కళ్యాణ్‌ భీమ్లా నాయక్‌ సినిమా ను వాయిదా వేయడం జరిగింది.

సంక్రాంతికి రావాల్సిన ఆ సినిమా లను ఆర్ ఆర్‌ ఆర్ మరియు రాధే శ్యామ్‌ సినిమాల కోసం వాయిదా వేయడం జరిగింది.

Telugu Bangarraju, Bheemla Nayak, Krithi Shetty, Mahesh Babu, Naga Chaitanya, Na

పెద్ద మొత్తంలో అంచనాలున్న ఆ సినిమా లకు పోటీ వద్దనే ఉద్దేశ్యంతో వపన్ మరియు మహేష్ లు తప్పుకున్నారు.కాని నాగార్జున మాత్రం సంక్రాంతికి వచ్చేలా ఉన్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సందిగ్దం నెలకొంది.ఈ సస్పెన్స్ కు నాగార్జున నోరు విప్పితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

మరి ఎప్పటికి బంగార్రాజు క్లారిటీ ఇస్తారో చూడాలి.ఒక వేళ సంక్రాంతికి బంగార్రాజును ప్రకటిస్తే ఆర్‌ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ మేకర్స్ లైట్ తీసుకుని వస్తే రానివ్వండి అంటారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube