ఐపీఎల్ 2022 సీజన్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఈసారి రెండు కొత్త జట్లు యాడ్ కాబోతున్నాయి.
అంతేకాదు, ఈసారి పాత ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను పూర్తిగా మార్చేస్తున్నాయి.ఇప్పటికే ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది.
ఈ క్రమంలో మెగా వేలం ఎప్పుడు నిర్వహిస్తారా అని ఐపీఎల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో వారికి ఒక గుడ్ న్యూస్ అందింది.
ఐపీఎల్-2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.ప్లేయర్ల వేలం ప్రక్రియ 2022, ఫిబ్రవరి తొలి వారంలో 2 రోజులపాటు నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆ దిశగా ఇప్పటికే బీసీసీఐ ఏర్పాట్లను చేస్తోందని సమాచారం.సాధారణంగా వేలం ప్రక్రియ ముంబయిలో జరుగుతుంది.కానీ ఈసారి మెగా వేలం హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ డిసైడ్ అయినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.
నిజానికి ఐపీఎల్ 2022 మెగా వేలం ప్రక్రియను జనవరి తొలి వారంలోనే ముగించాలని బీసీసీఐ భావించింది.కానీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్‌కు బెట్టింగ్ కంపెనీలతో లింకు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారాన్ని నిగ్గతీసిన తర్వాతనే మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.
అయితే ఈ అంశం జనవరి తొలి వారంలో ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.దీంతో ఫిబ్రవరి తొలి వారంలో మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
బెంగళూరు లేదా హైదరాబాద్‌లో మెగా వేలం నిర్వహించాలని భావిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారి ఒకరు చెప్పారు.అయితే కొత్త జట్లు అయిన లక్నో, అహ్మదాబాద్ ఆటగాళ్ల వేలం ప్రక్రియ లో ముగ్గురు ప్లేయర్లను నేరుగా ఎంచుకోవచ్చు.
కాగా ప్రస్తుతం ఈ అంశం ఆసక్తికరంగా మారింది.