సినిమాల ద్వారా సంపాదించుకున్న క్రేజ్ వల్ల సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.స్వయంకృషితో సినిమాలలో, రాజకీయాలలో సీనియర్ ఎన్టీఆర్ సక్సెస్ సాధించారు.
మేకప్ మేన్ మాధవరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవుడు చేసిన మనుషులు సినిమాకు రామారావు బాగా కోపరేట్ చేశారని చెప్పుకొచ్చారు.ఆ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ విగ్ ను తానే తయారు చేశానని మాధవరావు తెలిపారు.
విగ్ బాగా సూట్ కావడంతో బాగా చేశానని సీనియర్ ఎన్టీఆర్ మెచ్చుకున్నారని మాధవరావు పేర్కొన్నారు.దేవుడు చేసిన మనుషులు అయిపోయిన తర్వాత కృష్ణగారు అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తుంటే ఆ సినిమా బాగుండదు అని ఎన్టీఆర్ అన్నారని దేవుడు చేసిన మనుషులు 100 రోజుల ఫంక్షన్ లో రామారావు ఫ్యాన్స్ గందరగోళం చేయడంతో ఎన్టీఆర్, కృష్ణ మధ్య వైరం మొదలైందని మాధవరావు చెప్పుకొచ్చారు.
రామారావుగారు అల్లూరి సీతారామరాజు సినిమా ని చూస్తానని చెప్పి షో వేయించుకుని చాలా బాగా తీశారని మా వల్ల అయ్యేది కాదని అన్నారని మాధవరావు పేర్కొన్నారు.

న భూతో న భవిష్యత్ అనేలా సినిమా ఉందని సీనియర్ ఎన్టీఆర్ మెచ్చుకున్నారని మాధవరావు చెప్పుకొచ్చారు.ఆ తర్వాత వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాలో ఎన్టీఆర్, కృష్ణ కలిసి నటించారని ఆ సమయంలోనే ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారని మాధవరావు పేర్కొన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ఉదయం 7 గంటలకే రెడీ అయ్యి లొకేషన్ లో కూర్చునే వారని ఆయన వస్తున్నారంటే అందరూ కంగారు పడి పరుగెత్తేవాళ్లమని మాధవరావు తెలిపారు.కృష్ణగారు, నేను వెళ్లామని ఎన్టీఆర్ కృష్ణతో బ్రదర్ నేను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నా మీరు కూడా క్యాంపెయిన్ కు రావాలి అని అన్నారని కృష్ణ అలాగేనండి అని చెప్పారని మాధవరావు పేర్కొన్నారు.ఆ తర్వాత పేపర్ చదవని ఎన్టీఆర్ కు పాలిటిక్సా అని కృష్ణ తనతో అన్నారని మాధవరావు వెల్లడించారు.