సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య దూరం పూర్తిగా తగ్గిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు వారి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు వారి చిన్ననాటి ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంతకీ ఎంతో ముద్దుగా ఉన్నటువంటి ఈ చిన్నారి ఫోటో ఎవరిదో గుర్తుపట్టారా.ఈమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అన్ని పెళ్లికి సంబంధించిన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు ఎలాంటి గ్లామరస్ పాత్రలకు చోటివ్వకుండా కథ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
విజయ్ దేవరకొండ సినిమాలో నటించిన బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ తనకు అలాంటి వరుడు కావాలంటూ తాజాగా తన చేసుకోబోయే వాడు గురించి బయట పెట్టింది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.అదేనండి వరుడు కావలెను అంటూ ప్రేక్షకులను సందడి చేసిన హీరోయిన్ రీతూ వర్మ.ఈమె పెళ్లి చూపులు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.
చిన్నప్పటి ఫోటోలో రీతూవర్మ ఎంతో ముద్దుగా బొద్దుగా ఉంది కదూ.