కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బాగా యాక్టీవ్ అయ్యారు.2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేర్చుతాను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడం , ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం వంటివి జరిగాయి. అయితే కాపు రిజర్వేషన్ అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టడంతో ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు ఉద్యమం మొదలైంది.కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఎంతో కాలం ఉద్యమాన్ని నడిపించారు.
ఆ తరువాత వ్యక్తిగతంగాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రిజర్వేషన్ విషయంలో టీడీపీ ప్రభుత్వం పట్టించుకోనట్టు గా వ్యవహరించింది.
ఇక ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడం వంటి కారణాలతో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టి ఇక ఆ తర్వాత పూర్తిగా తను ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే అప్పట్లో ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం గట్టిగా జరిగింది .బీజేపీలో వైసీపీల నుంచి ముద్రగడ పద్మనాభం కు ఆహ్వానాలు అందాయి.కానీ ఏ పార్టీలోనూ ఆయన చేరేందుకు ఇష్టపడలేదు.
సైలెంట్ గానే అప్పటి నుంచి ఉంటున్నారు .అయితే గత కొద్దిరోజులుగా ముద్రగడ యాక్టివ్ అయ్యారు .ఏపీ సమస్యలపై ఆయన సీఎం జగన్ కు లేఖలు రాస్తున్నారు. అలాగే తెలంగాణలో ధాన్యం సమస్య పైన కేసీఆర్ కు లేఖ రాశారు .వరుసగా ముద్రగడ పద్మనాభం లేఖలు రాస్తూ , తన ఉనికిని చాటుకోవడం వంటివి ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టేందుకే అన్న అనుమానాలు మొదలయ్యాయి.ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానం పైన ముద్రగడ స్పందించారు.
గతంలో తన కుటుంబానికి ఇంతకంటే ఘోరంగా టీడీపీ కారణంగా అవమానం జరిగిందని , ఆ పార్టీ పై తనకున్న కోపాన్ని వెళ్లగక్కగా, ఇప్పుడు వరుసగా లేఖలతో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నించడం చూస్తుంటే ముద్రగడ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి .అయినా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై చాలా కాలం అయింది.