ఏపీలో లాక్ డౌన్ కి సంబంధించి స్పష్టత ఇచ్చిన సీఎం జగన్..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే.ఊహించని విధంగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతూ ఉండటంతో చాలా రాష్ట్రాలలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ… లాక్ డౌన్ లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు.

 Cm Jagan Clarification On Ap Lock Down Ys Jagan, Lock Down, Ap , Vacinationa , N-TeluguStop.com

తెలుగు రాష్ట్రాలలో కూడా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కరోనా నిబంధనలు కఠినం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఏపీలో కూడా పెరుగుతూ ఉండటంతో లాక్ డౌన్ మళ్లీ విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో సీఎం జగన్ తాజాగా ఏపీలో లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చారు.

శుక్రవారం కరోనా నియంత్రణకు సంబంధించి సమీక్ష సమావేశం అన్ని జిల్లాల కలెక్టర్లతో, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన క్రమంలో మళ్లీ లాక్ డౌన్ పై జగన్ క్లారిటీ ఇచ్చారు.ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టే ప్రసక్తి లేదని తెలియజేశారు.

గత ఏడాది లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతినటం జరిగిందని ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారనిఅన్నారు.మళ్లీ ఆ పరిస్థితి రాకూడదు అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరగాలనిఅందుకోసం ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని పేర్కొన్నారు.కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో టెస్టింగ్ తోపాటు ఆసుపత్రుల సన్నద్ధత, బెడ్ల పెంపు, చికిత్స తదితర అంశాలపై సీఎం కలెక్టర్లకు, ఎస్పీలకు పలు సూచనలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube