సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఇండస్ట్రీకి నటన మీద ఆసక్తితో అడుగు పెడతారు.ఇండస్ట్రీలో మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు.
నిజానికి నటీనటులు నటన మీద ఆసక్తితో ఎన్నో వదులుకుంటారు.తమకు ఇష్టమైన వాటిని త్యాగం చేస్తుంటారు.
అలా ఇప్పటికి ఎంతో మంది నటీనటులు తమ చదువు విషయంలో, మరేదైనా వ్యక్తిగత విషయంలో నటన కోసం త్యాగం చేశారు.ఇదిలా ఉంటే ఓ సీరియల్ నటి కూడా నటన కోసం ఎంబీబీఎస్ సీటును వదులుకుంది.
మామూలుగా ఎం బి బి ఎస్ అంటే ఎంత పెద్ద చదువో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే ఆ చదువు డాక్టర్ కి సంబంధించింది.ఎన్నో డబ్బులు పెడితే కానీ ఈ డాక్టర్ చదువు చదవలేము.అసలు ఈ ఎం బి బి ఎస్ లో అవకాశం వస్తే మాత్రం ఎవరు వదులుకోరు.
ఎందుకంటే అందులో సీటు రావడమే చాలా గొప్పది.అటువంటిది ఆ సీరియల్ నటి నటన కోసం డాక్టర్ చదువునే వదులుకుంది.
ఇంతకీ ఆ నటి ఎవరో కాదు.
బుల్లితెర నటి శ్రీ సత్య.
ఈమె బుల్లితెరపై ముద్దమందారం, త్రినయని, నిన్నే పెళ్ళాడుతా, అత్తారింట్లో అక్క చెల్లెలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.తన అందంతో కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈమె విజయవాడకు చెందిన నటి.ఎన్నో చదువులు చదివి చివరికి నటిగా మిగిలింది.

ఈమె మోడల్ గా కూడా చేసింది.మిస్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అనే టైటిల్స్ కూడా సొంతం చేసుకుంది.శ్రీ సత్యకు డాన్స్ పట్ల కూడా మంచి టాలెంట్ ఉంది.ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా పలు యాడ్స్ లో కూడా చేసింది.ఇక లవ్ స్కెచ్, ఏఎన్ఆర్ కన్ఫ్యూజ్ అయ్యాడు, తరుణం వంటి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.
ప్రస్తుతం పలు సీరియల్స్ లో బిజీగా ఉంది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె బుల్లితెరపై ప్రసారం అవుతున్న సూపర్ క్వీన్స్ షోలో పార్టిసిపెంట్ చేస్తుంది.ఈ షో లో యాంకర్ ప్రదీప్ హోస్టింగ్ చేస్తున్నాడు.ఇందులో మొత్తం 10 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ఇక శ్రీ సత్య కూడా పాల్గొని ఈ షోలో ఎలాగైనా గెలవాలి అని ముందుకు వచ్చింది.

ఎంట్రీ తో తన డాన్స్ తో అదరగొట్టింది.అంతేకాకుండా ఓ ఎమోషనల్ స్టొరీ తో పర్ఫామెన్స్ చేసింది.ఇక తను వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పుల గురించి పంచుకుంది.ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపింది.ఇక తన ఫ్రెండ్ తన కోసం వేదికపైకి వచ్చి తను పడిన కష్టాల గురించి తెలిపింది.ఇక మరో ఫ్రెండ్ వీడియో కాల్ ద్వారా నటన గురించి ఎంబిబిఎస్ చదువును కూడా త్యాగం చేసావు అని అనేసరికి ఎమోషనల్ అయ్యింది శ్రీ సత్య.