దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్నటువంటి సమంత ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వచ్చినప్పటికీ మొదట్లో తిరస్కరించింది.
అయితే అప్పుడు సమంత ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉండటం వల్ల ఎలాంటి సినిమాలకు ఒప్పుకోకుండా ఉందని వార్తలు వచ్చాయి.అయితే నాగచైతన్య సమంత దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం వీరు విడాకులు తీసుకోబోతున్నారు అని ప్రకటించారు.
ఇలా విడాకుల ప్రకటన చేసిన తర్వాత సమంత తిరిగి సినిమా కథలను వింటూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే సమంత కేవలం టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాకుండా హాలీవుడ్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సమంత బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి యష్ రాజ్ ఫిలిమ్స్ తో సమంత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
సమంత ఈ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే ఒకేసారి రెండు మూడు సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకుంటారని తెలుస్తోంది.
ఇదే కనుక నిజమైతే సమంత ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు తెలుగు తెరపై కనిపించదని చెప్పవచ్చు.ప్రస్తుతం బీ టౌన్ సమాచారం ప్రకారం ఈ నిర్మాణ సంస్థతో సమంత డీల్స్ కుదుర్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కరీనా కపూర్ వంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఈ నిర్మాణ సంస్థ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నవారేనని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం సమంత కూడా నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరపడం చూస్తుంటే ఈమె కూడా దాదాపు ఈ నిర్మాణ సంస్థతో సినిమాలు తీయబోతున్నారని తెలుస్తోంది.దాదాపు ఏ నిర్మాణ సంస్థ అయిన ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకుంటారు కానీ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే మూడు నాలుగు సంవత్సరాల పాటు నిర్మాణ సంస్థలో పని చేయాలని ఈ విధమైనటువంటి మంచి అవకాశాలు వచ్చినా ఆ అవకాశాలను వదులుకోవాల్సిందేనని చెప్పవచ్చు.
ఇక సమంత ప్రస్తుతం తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నయనతార ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అదే విధంగా తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో నటించిన ఈమె ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
ఇదిలా ఉండగా సమంత ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మనకు తెలిసిందే.ఇలా విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సమంత తన దూకుడును పెంచిందని చెప్పవచ్చు.
యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థతో సమంత ఏ విధమైనటువంటి ఒప్పందం కుదుర్చుకుందనే విషయం తెలియాల్సి ఉంది.