వరద రాజకీయం... క్లారిటీ ఇచ్చిన జగన్

ఏపీలో వరద రాజకీయం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం.గత కొద్దిరోజులుగా రాయలసీమ ప్రాంతంలో కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి జనజీవనం అస్తవ్యస్తమైంది ఎంతోమంది ఈ ఘటనలో మరణించిన మరెంతో మంది నిరాశ్రయులయ్యారు భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

 Ap Cm Jagan Clarity Over Not Visiting Flood Affected Areas Details, Ap Cm Jagan-TeluguStop.com

వరద ప్రభావిత ప్రాంతాలను ఏపీ సీఎం జగన్ స్వయంగా పరిశీలించి తగిన సహాయం ప్రకటిస్తారని అంతా అంచనా వేశారు కానీ జగన్ మాత్రం యధావిధిగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు జగన్ ముసలి వాడు అని, అందుకే ఆయన కాలు బయట పెట్టడం లేదంటూ కామెంట్స్ చేశారు.

దీనిపై ఈ రోజు అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ స్పందించారు.

తాను ముఖ్యమంత్రిగా అక్కడ పర్యటనకు వెళితే సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందనే తాను వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు.

తాను వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులు తనవెంటే తిరుగుతారని, అందుకే తాను క్షేత్రస్థాయిలో పర్యటించకుండా , ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ, అక్కడికి పంపించాను అని జగన్ క్లారిటీ ఇచ్చారు.

Telugu Ap Cm Jagan, Ap Flood, Ap, Assembly, Chandrababu, Kadapa Floods, Kadpa, F

ప్రతి రోజు వరద పరిస్థితులపై సమీక్ష చేస్తూ,  ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు ఇస్తున్నాను అని,  సహాయ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా వరద బాధిత ప్రాంతాల్లో అధికారులతో పాటు తాను పాల్గొంటానని జగన్ స్పష్టం చేశారు.కడప తన సొంత జిల్లా అని, ప్రేమ కాస్త ఎక్కువ అని చెప్పుకొచ్చారు.గాల్లో వచ్చారని, గాల్లోనే పోతారని చంద్రబాబు మాట్లాడారని, ఆయన సంస్కారానికి ఒక నమస్కారం అంటూ జగన్ ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube