మీకొక వింత అయిన ఇళ్ల గురించి చెప్పాలి.ఈ ఇళ్ల నిర్మాణం గురించి మీకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి.
ఈ ఇళ్ళు చూడడానికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తాయి.ఒక విధముగా చెప్పాలంటే అచ్చం ఈ ఇళ్ళు చూడడానికి చిన్న పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బొమ్మలులాగానే ఉంటాయి.
మరి అలాంటి ఇళ్ల నిర్మాణాలను మీరు చూడాలనుకుంటే ఉక్రెయన్ వెళ్లాల్సిందే.ఉక్రేయిన్ లోని కీవ్ నగరంలో ఈ కలర్ఫుల్ కట్టడాలు మనకి కనిపిస్తాయి.
ఈ పట్టణాన్ని ‘కంఫర్ట్ టౌన్‘ అని పిలుస్తారు.అలాగే ఈ పట్టణ నిర్మాణం 2019లో పూర్తిచేశారు.
ప్రస్తుతం ఈ భవనాలకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.
ఈ పట్టణంలోని ప్రతి బిల్డింగ్ చూడడానికి రకరకాల రంగులతో ఉంటాయి.
ఎక్కువగా పింక్, ఆరెంజ్, గ్రీన్, పసుపు వంటి రంగులతో చాలా కలర్ఫుల్ గా కనిపిస్తాయి.ఎత్తైన ప్రదేశం నుంచి ఈ భవనాలను చూస్తే చిన్న పిల్లలు ఆడుకొనే లెగో బ్రిక్స్ రూపంలో కనిపిస్తాయి.
అందుకే వీటిని లెగో బిల్డింగ్స్ అని అక్కడ ప్రజలు పిలుస్తున్నారు.ప్రముఖ డిజైనర్లు డిమిట్రో వాసిలీవ్, అలెగ్జాండర్ పోపోవ్, ఓల్గా అల్ఫియోరోవాలు ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు పదకొండేళ్లు కష్టపడ్డారు.

ఈ పట్టణం సుమారు మొత్తం 115 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.అలాగే ఇక్కడ 8,500 ఫ్లాట్లను నిర్మించారు.ఈ రంగుల ఇళ్ల గురించి తెలియగానే అక్కడ ఫ్లాట్లు కొనుక్కునే అందుకు ప్రజలు ఎగబడ్డారు.ఫిబ్రవరి 2020లో ఆ దేశంలోనే అత్యధికంగా నెలకు 200 కంటే ఎక్కువ ఇళ్లు హాట్ కేకుల్లాగా అమ్ముడయ్యాయంటే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో మీరే ఊహించుకోండి.
ప్రస్తుతం ఈ కంఫర్ట్ టౌన్లో 20,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.