టాలీవుడ్ నటుడు, దర్శకుడు విశ్వక్ సేన్ గురించి అందరికీ తెలుసు.నటుడిగా కంటే దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఈయన ఎక్కువగా మాట్లాడే మాటలతో హాట్ టాపిక్ గా మారుతుంటాడు.పైగా ఆయన చేసే వ్యాఖ్యలు కూడా అలాగే ఉంటాయి.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీ రామచంద్ర, రవి పై సెటైర్లు వేశాడు.
ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్ రవి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.ఇక వీరిద్దరిపై తాజాగా విశ్వక్ సేన్ సెటైర్లు వేశాడు.మామూలుగా ఈ బిగ్ బాస్ షో చూడటానికి సినీ నటీనటులకు అంతా సమయం అనేది ఉండదు.
కానీ ఎంతో కొంత మంది ఈ షోను చూడటానికి సమయాన్ని కేటాయిస్తారు.
అందులో విశ్వక్ సేన్ కూడా ఈ షోను చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇక తాజాగా విశ్వక్ చేసిన సెటైర్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
నామినేషన్ ప్రక్రియలో శ్రీరామచంద్ర అటూ ఇటూ తిరుగుతూ ఉండగా షుగర్ వచ్చిందేమో అని కౌంటర్ వేసాడు.
ఇక రవి పై కూడా ఓవర్ స్మార్ట్ షుగర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ వేసాడు.దీంతో విశ్వక్సేన్ మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నాడు.శ్రీ రామచంద్ర, రవి అభిమానులు అతడిపై తెగ నెగిటివ్ కామెంట్లు చేశారు.
అంతేకాకుండా అతడిపై మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు.ఇక వీరిద్దరిపై విశ్వ కౌంటర్లు వేయటంతో బహుశా సన్నీ కే ఫుల్ సపోర్ట్ గా ఉన్నడేమో అని అనిపిస్తుంది.
మొత్తానికి విశ్వక్ మాటల పట్ల అతడు రవికి, శ్రీరామచంద్ర కి సపోర్ట్ చేస్తున్నట్లు లేదు.