ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ షో పూర్తి కావడానికి కూడా దగ్గర్లో ఉంది.
ఇక అన్ని సీజన్ లాగానే ఈ సీజన్ కూడా హైలేట్ గా మారింది.కంటెస్టెంట్ లందరూ భాగాలుగా విడిపోతూ.
అవతలి కంటెస్టెంట్ ల గురించి నెగటివ్ గా మాట్లాడటం, పెళ్లి కాని జంటల మధ్య ప్రేమలు పుట్టడం ఇలా అన్నీ జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇందులో ఓ జంట మాత్రం బాగా రెచ్చిపోతున్నారు.
ఇంతకీ ఆ జంట ఎవరో కాదు సిరి, షణ్ముఖ్.మొదటి నుంచి వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉంటూ అందరి దృష్టిలో పడ్డారు.
వీరిద్దరు వేరే వ్యక్తులతో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.అయినా కూడా వీరిద్దరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు.
ఇదిలా ఉంటే 80 వ ఎపిసోడ్ లో వీరిద్దరూ మళ్లీ రెచ్చిపోయారు.
రాత్రి పడుకునేటప్పుడు వీళ్ళ మధ్య జరిగే రచ్చ అంతా ఇంతా కాదు.
షణ్ముఖ్ ఎంతకాదన్నా సిరి వినకుండా తన దగ్గరికి వెళ్లి బాగా ఓవర్ గా ప్రవర్తిస్తుంది.

నిజానికి ఈమె ప్రవర్తన చూస్తే మాత్రం తన బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇచ్చేలా కనిపిస్తోంది.ఎందుకంటే మొన్నీమధ్య షణ్ముఖ్ లిప్ కిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇచ్చిన కూడా సిరి మాత్రం అస్సలు తగ్గట్లేదు.
ఇక ఆ రోజు రాత్రి మొత్తానికి షణ్ముఖ్ దగ్గరికి వెళ్లి పడుకుంది.వీరిద్దరు చీకట్లో మళ్లీ హగ్గు లతో రెచ్చిపోయారు.
ఈ సీన్ చూసిన ప్రేక్షకులు మాత్రం అస్సలు విమర్శలు చేయకుండా ఉండట్లేదు.ఇక చివరి వరకు వీరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో చూడాలి.