భారతీయ వంటకాల్లో బెల్లంను విరి విరిగా ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే.మధురమైన రుచిని కలిగి ఉండే బెల్లంలో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషక విలువలు ఎన్నో నిండి ఉంటాయి.
అందుకే రోజుకు చిన్న బెల్లం ముక్క తీసుకుంటే బోలెడన్ని ఆరోగ్య లాభాలు లభిస్తాయని నిపుణులు చెబుతుంటారు.అలాగే బెల్లంతో కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలనూ నివారించుకోవచ్చు.
అవును, ఇప్పుడు చెప్పే విధంగా బెల్లాన్ని తీసుకుంటే గనుక నిత్యం మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు.మరి లేటెందుకు బెల్లాన్ని ఎలా తీసుకుంటే ఏ ఏ ప్రయోజనాలు లభిస్తాయో చూసేయండి.
బెల్లం-ధనియాలు.ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.అర స్పూన్ ధనియాల పొడికి ఒక స్పూన్ బెల్లం పొడి కలిపి ఉండలా చేసుకుని తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే ఎముకలు, కండరాలు దృఢంగా మారి నొప్పులు తగ్గుతాయి.
అలాగే మహిళలు నెలసరి సమయంలో ఈ రెండిటినీ తీసుకుంటే అధిక రక్తస్రావం తగ్గుతుంది.మరియు ఆ సమయంలో వచ్చే నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.
చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు.అయితే ఈ సమస్యకూ బెల్లం ఉపయోగపడుతుంది.అర స్పూన్ బెల్లానికి అర స్పూన్ సోంపు కలిపి నోట్లో వేసుకుని బాగా నమిలి తినాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే నోటి దుర్వాసన సమస్యే ఉండదు.

ఒక స్పూన్ బెల్లం పొడికి అర స్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకుంటే వాపులు తగ్గుతాయి.మరియు శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరిగి పోతుంది.అలాగే ఒక స్పూన్ బెల్లం పొడికి చిటికెడు పసుపు కలిపి తీసుకుని రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.తద్వారా పలు అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
ఇక కొందరు మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారు ఒక స్పూన్ బెల్లానికి ఒక స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవాలి.
తద్వారా జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారి మలబద్ధకం తగ్గు ముఖం పడుతుంది.