దేశంలోని హెల్త్‌కేర్ వర్కర్స్‌కి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ శుభవార్త చెప్పారు.దేశంలోని ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరతను పరిష్కరించడానికి కరోనా వైరస్ సహాయ ప్యాకేజీ నుంచి 1.5 బిలియన్లను పెట్టుబడి పెడుతున్నట్లు కమలా హారిస్ సోమవారం ప్రకటించారు.నేషనల్ హెల్త్ సర్వీస్ కార్ప్స్, నర్స్ కార్ప్స్, సబ్‌స్టాన్స్ యూజ్ డిజార్డర్ ట్రీట్‌మెంట్ అండ్ రికవరీ ప్రోగ్రామ్‌లు, హెల్త్‌కేర్ విద్యార్ధులు, కార్మికులు, కమ్యూనిటీలలో పనిచేసే వారికి స్కాలర్‌షిప్‌లు, లోన్ రీపేమెంట్‌లను అందించే అన్ని ఫెడరల్ ప్రోగ్రామ్‌లకు ఈ నిధులు వెళ్లనున్నాయి.
వైట్‌హౌస్ లెక్కల ప్రకారం.అమెరికన్ రెస్క్యూ ప్లాన్ , ఇతర వనరులకు సంబంధించిన నిధులు 22,700 ప్రొవైడర్లకు మద్ధతుగా నిలవనుంది.ఈ నెల ప్రారంభంలో వైట్‌హౌస్ కోవిడ్ 19 హెల్త్ ఈక్విటీ టాస్క్ ఫోర్స్ రూపొందించిన సిఫార్సులకు అనుగుణంగా ఈ నిధులు అందిస్తారు.కోవిడ్ మహమ్మారి.
మైనారిటీలు, వెనుకబడిన వర్గాల ఆరోగ్య సంరక్షణ అసమానతలను హైలైట్ చేసింది.కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ విశ్లేషణ ప్రకారం.
కోవిడ్ సమయంలో మైనారిటీ అమెరికన్లు శ్వేతజాతీయుల కంటే ఎక్కువ సంఖ్యలో కేసులను, మరణాలను చవిచూశారు.దేశ ప్రజల్లోని ఈ ఆరోగ్య అసమానతలను నివారించాల్సిన అవసరం వుందని కమలా హారిస్ అన్నారు.
కరోనా మహమ్మారి వల్ల ఆర్ధికంగా, సామాజికంగా ఎంతో నష్టపోయిన అమెరికన్లను ఆదుకునేందుకు గాను జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.ద అమెరికన్ రెస్క్యూ ప్లాన్’ పేరుతో ప్రకటించిన ఈ బిల్లుకు సెనేట్, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలపగా, బైడెన్ సంతకంతో చట్టంగా మారింది.ఈ నిధులతో కరోనా పరీక్షల నిర్వహణ, టీకా కార్యక్రమాలతో పాటు.
పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడతామని బైడెన్ ఇప్పటికే తెలిపారు.
దీంతో ఈ ప్యాకేజ్ ఫలాలను ప్రజలకు పంచడం ప్రారంభించింది ఫెడరల్ ప్రభుత్వం.దీని ద్వారా సుమారు 400 బిలియన్ డాలర్లు అమెరికన్లకు ఆర్థిక సాయంగా అందుతోంది.ఏడాదికి 75 వేల డాలర్లు సంపాదిస్తున్న ఒక్కొ అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లు (సుమారు రూ.లక్ష) జమ చేస్తున్నారు.అలాగే పబ్లిక్ హెల్త్ వర్క్‌ఫోర్స్‌లో వైవిధ్యాన్ని మెరుగుపరచడం, వైకల్యాలున్న వ్యక్తులకు మద్ధతు ఇవ్వడం కోసం ఫెడరల్ ప్రోగ్రామ్‌ల కోసం వైట్‌హౌస్ అదనంగా 875 మిలియన్ నిధులను ప్రకటించిన సంగతి తెలిసిందే.