అనసూయ.ఈ పేరును పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.
తెలుగు తెరకు హాట్ యాంకర్ గా పరిచయం అయ్యి వరుస షోలు చేస్తూ బిజీగా ఉంది.అటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఇటు వెండితెర మీద కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.
అనసూయ కెరీర్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది.
చేతినిండా అవకాశాలను అందుకుంటూ మంచి మంచి పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది.
ఇక ప్రెసెంట్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా అయినా పుష్ప సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకునేందుకు సిద్ధం అవుతుంది.
ఈ సినిమాలో పొగరుబోతు దాక్షాయణిగా నటిస్తుంది.ఇప్పటికే రివీల్ చేసిన లుక్ అందరిని ఆకట్టుకుంది.

ఇక ఈమె పేరు గురించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె అసలు పేరు అనసూయ కాదట.ఈ విషయమే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.యాంకర్ అనసూయ తల్లిదండ్రులు ఆమెకు ముందుగా ఈ పేరు పెట్టలేదట.అనసూయ తల్లి ఆమెకు పవిత్ర అనే పేరు పెట్టిందట.అయితే ఆమె తండ్రి మాత్రం పవిత్ర అనే పేరును మార్చి అనసూయ అని పెట్టాడట.

ఎందుకంటే అనసూయ తండ్రి వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములట.వారికీ ఆడపిల్లలు లేకపోవడంతో ఆమె తండ్రి పవిత్ర పేరును మార్చి ఆమె తల్లి అయిన అనసూయ పేరును పెట్టాలని అనుకున్నారట.ఈ క్రమంలోనే అనసూయ వాళ్ళ నానమ్మ పేరు పెట్టుకుంది.ఇక ఇప్పుడు ఆ పేరు తోనే తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకు పోతుంది.