ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు భీబత్సం సృష్టిస్తున్నాయి.పలు ప్రాంతాల్లో ముంచెత్తిన వరదల కారణంగా జన జీవనం మొత్తం స్పందించి పోయింది.
భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు వరదలు రావడంతో ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు.ఇక ఏపీలో కడప జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి.
ఈ వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.
ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.కడప లోని రాజంపేట మండలం లో వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి.దీంతో ప్రజలు ఈ వర్షాలు, వరదల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
రామాపురం చెయ్యేరు నది లో రెండు ఆర్టీసీ బస్సులు ఇరుక్కు పోయాయి.ఏకంగా బస్సు మునిగేంత నీరు ప్రవహిస్తూ ఉండడంతో జనాలు భయాందోళనకు గురి అవుతున్నారు.
ఈ నదిలో రెండు బస్సులు పూర్తిగా ఇరుక్కు పోయాయి.మరొక బస్సు రోడ్డు మీద కొద్దిగా నీళ్లలో ఇరుక్కు పోవడంతో అందులోని ప్రయాణికులు ప్రాణ భయంతో అరుపులు మొదలు పెట్టారు.
ఆర్టీసీ బస్సులో చిక్కుకున్న ప్రజలు ఆర్తనాదాలతో చుట్టూ పక్కల అంత మారుమోగి పోయింది.బస్సు లోపలికి కూడా నీరు వస్తుందేమో అన్న భయంతో ప్రయాణికులు అందరు బస్సు మీదకు ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసారు.
ఇదంతా కూడా వీడియో రూపంలో బయటకు వచ్చింది.ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో చుస్తేనే గుండె జల్లుమంటుంది.ఈ వీడియోలో ఒక బస్సు మొత్తం మునిగి పోయి మరి కనిపించింది.ఇక మరొక రెండు బస్సులు రోడ్డు మీద కొద్దిగా నీరు ప్రవహిస్తూ ఉండగా అక్కడ చిక్కుకున్నాయి.ఈ బస్సులో ప్రయాణికులు కూడా ఉండడంతో వారు భయంతో బస్సు మీదకు ఎక్కేసారు.