చదువు నెరవేర్చని కల.. టీ కొట్టు నెరవేర్చింది..ఆమె విజయగాధ !

ఈమె గురించి తెలుసుకుంటే మీరు కూడా ఈమె చాలా గ్రేట్ అని అనకుండా ఉండరు.ఈమె విజయగాధ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

 Ma English Chaiwali Inspiring Story Of Tuktuki Das, Hebra Railway Station, Ma En-TeluguStop.com

ఈమెను ఆదర్శంగా తీసుకుంటే సరైన మార్గంలో నడుస్తారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.చేసే పని ఎలాంటిది అనేది చూడకూడదు.

కేవలం దాని ఫలితమే చూడాలి అని ఆమె నిరూపించింది.తల్లిదండ్రులు ఆమె ఆలోచనను తప్పు పట్టిన ఆమె మాత్రం అనుకున్నది సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది.

ఆమె పెద్ద చదువులే చదివింది.కానీ ఉద్యోగం ఎంత ప్రత్నించిన రాలేదు.దీంతో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది.కానీ ఆమె ఆలోచన తన తల్లి దండ్రులతో పంచుకున్న వారు ఆ పని చేస్తావా అని నిరాశ పరిచిన కూడా ఆమె వెనకడుగు వేయకుండా ఆమె నిర్ణయాన్ని ముందుకు తీసుకు వెల్లింది.

చివరకి తాను అనుకున్న దానిలో విజయాన్ని సాధించింది.

ఇంతకీ ఆమె ఏం పనిలో విజయం సాధించిందో తెలియాలంటే అసలు మ్యాటర్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే.

తుక్ తుకీ దాస్ పీజీ చదివింది.కానీ ఆమెకు ఉద్యోగం రాలేదు.

అంతేకాదు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే కరోనా మహమ్మారి రావడంతో కొత్త ఉద్యోగాలు రావడం కష్టం అయిపొయింది.దీంతో ఆ యువతికి ఒక కొత్త ఆలోచన వచ్చింది.

కానీ ఆ ఆలోచనను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.అయినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళింది.

పశ్చిమ బెంగాల్ లోని హెబ్రా రైల్వే స్టేషన్ లో ఒక చిన్న షాప్ ను అద్దెకు తీసుకుని టీ స్టాల్ ను పెట్టింది.మొదటి రోజు వచ్చిన కస్టమర్లకు టీ ను ఫ్రీగా ఇచ్చింది.

ఇక తన చాయ్ షాప్ కు ఆకట్టుకునే విధంగా ‘మా ఇంగ్లీష్ ఛాయ్ వాలా’ అనే పేరు పెట్టింది.దీంతో ఇప్పుడు ఆ ఛాయ్ దుకాణం అక్కడ ఫేమస్ అయ్యింది.

ఉద్యోగం వేటలో ఫెయిల్ అయినా కూడా సంపాదించాలనే కల ను ఈవిధంగా నెరవేర్చుకుంది.ఇక ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది.

ఉద్యోగం లేదని బాధపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఎంతోమంది ఈమెను స్ఫూర్తిగా తీసుకుంటే ఎలాంటి ఆత్మహత్యలు జరగవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube