ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరు, అమెరికా బిలియనీర్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ వ్యక్తిగత ఉపయోగాల కోసం వినియోగించే కంప్యూటర్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తిగా బిల్ గేట్స్ ఎంతో పేరు పొందాడు.30 సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయాడు.బిల్ గేట్స్ ఆ సంస్థ బాధ్యతల నుంచి, తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ కు పూర్తి కాలం వినియోగించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ లో తన కార్యకలాపాలకు జూన్ 8, 2008 వీడ్కోలు పలికారు.ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దానాలు సహాయాలు చేసాడు.
ఇంకా చేస్తున్నాడు కూడా.రీసెంట్ గా భార్య మెలిందాతో విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే తాజాగా కువైట్ నటి, సింగర్ అయిన సాంగ్స్ బందర్ అల్ అస్లామీ.బిల్ గేట్స్ కు పెళ్లి ప్రతిపాదన పంపింది.
పెళ్లి చేసుకుందాం రమ్మంటూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ ఈ ప్రపోజల్ పెట్టింది.అందులో ఇలా ఉంది.
గతంలో ‘ఏదో వైరస్ ప్రపంచంలో పెద్ద నష్టాన్ని చూపిస్తుందని.శాస్త్రీయ పరిశోధన కోసం నిధులు సమకూర్చాలని ముందుగానే ఆయన డిమాండ్ చేశాడు.అలా జరగబోయే దాని గురించి రెడీగా ఉన్నాడు.అంటూ దానికి సంబంధించిన ట్వీట్ కు ట్యాగ్ చేస్తూ.’ అందమైన వ్యక్తి ఎలక్ట్రానిక్ యుగాన్ని ఏలుతున్న వాడు.అంచనాలతో ఎక్కడి వరకు ఎలా ఎదగాలో తెలిసినవాడు.
అందుకే అతనికి ఆఫర్ ఇస్తున్నాను అని ఆ నటి పేర్కొంది.