మైదాపిండితో చేసే వంటకాలు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి కదా.ఈ వంటకాలు తినడానికి బాగానే ఉంటాయి కానీ మీరు ఎప్పుడన్నా అసలు మైదాపిండిని ఎలా తయారు చేస్తారో అనే విషయం గురించి ఆలోచించారా.? ఎందుకంటే గోధుమ పిండిని గోధుమల నుంచి తయారుచేస్తారు.అలాగే శెనగపిండిని శెనగ పప్పుతో తయారుచేస్తారు.
మరి మైదాపిండిని ఏ పప్పు నుండి తయారు చేస్తారో అనే ఆలోచన మీకు రావాలి.ఆ ప్రశ్నకు ఈరోజు మీకు సమాధానం కావాలంటే ఇక మిగితా సమాచారం తెలుసుకోవలసిందే.
మైదాపిండి ఎలా తయారు చేస్తారో తెలుసుకుంటే అసలు మైదా పిండి వాడాలంటేనే భయపడిపోతారు.ఎందుకంటే మైదాకు ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది.
అసలు మైదా ఎలా తయారు చేయాలో చుద్దామా.
మైదా పిండి తయారు అవ్వడానికి ముడి పదార్థం గోధుమలు.
గోధుమ పిండి మంచిదే అంటారు కదా మరి గోధుమల నుండి తయారు అయిన మైదా ఎందుకు మంచిది కాదు అంటారా ? నిజానికి గోధుమల నుండి పిండి ఆడించడం ద్వారా మాత్రమే గోధుమపిండి తయారవుతుంది.కానీ మైదా అలా కాదు.
గోధుమలను ఎక్కువగా పాలిష్ చేస్తారు.పై పొరలన్నీ పాలిష్ రూపంలో పోయిన తరువాత లోపల మిగిలిన గోధుమలను తరువాత పిండి ఆడతారు.
ఆ పిండి చూడడానికి పసుపు రంగులో ఉంటుంది.కానీ ఆ పిండిలో క్లోరైడ్ గ్యాస్, బైంజాయిల్ పెరాక్సైడ్, అజోడి కార్బోనమైడ్ వంటి రసాయనాలను కలపడం వలన ఆ పిండిని తెల్లగా, మృదువుగా మారుస్తారు
.

అంతేకాకుండా అదే మైదాలో చివరగా శక్తివంతమైన ఆక్సిడైజర్ అయిన పొటాషియం బ్రోమేట్ కూడా కలుపుతారు.ఇన్ని రకాల రసాయనాలు కలపడం ద్వారా మనకు మైదా తయారు అవుతుంది.ఇలా మైదాపిండిలో వాడే బెంజాయిల్ పెరాక్సైడ్ రసాయనం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు అధికంగా ఉండడంతో చాలా దేశాల్లో దీని వాడాకాన్ని నిషేధించారు.మైదాపిండిని నిత్యం ఆహారంలో భాగంగా వాడితే ఆరోగ్యసమస్యలు తప్పవని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మైదాపిండితో చేసిన వంటకాలు తినడం వలన షుగర్, గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్లు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అలాగే ఆడపిల్లలు ఎక్కువగా మైదా పిండి వంటకాలు తింటే చిన్న ఆడపిల్లలు వయసులోనే రజస్వల అయ్యే ప్రమాదం ఉంది.
ఇకనుండి అయిన మైదాతో చేసిన వంటకాలు తగ్గించి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.