షారుఖ్ ఖాన్ ను గన్ తో బెదిరించిన గౌరీ ఖాన్ సోదరుడు.. ఎందుకంటే?

ఈ మధ్య కాలంలో కొడుకు ఆర్యన్ ఖాన్ వల్ల షారుఖ్ ఖాన్ పేరు మీడియాలో బాగా వినిపించిన సంగతి తెలిసిందే.సినీ నటుడిగా, టీవీ ప్రముఖుడిగా షారుఖ్ ఖాన్ పాపులారిటీని సంపాదించుకోగా అభిమానులు షారుఖ్ ఖాన్ ను కింగ్ ఖాన్ అని పిలవడంతో పాటు బాద్ షా ఆఫ్ బాలీవుడ్ అని కూడా పిలుస్తారు.

 Shah Rukh Khan Was Threatened Gauri Khan Brother Vikrant Gun Wedding , Gun, Shah-TeluguStop.com

టీవీ సీరియళ్ల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన షారుఖ్ ఖాన్ కెరీర్ తొలినాళ్లలో విలన్ రోల్స్ లో కూడా నటించారు.

షారుఖ్ ఖాన్ భార్య పేరు గౌరీ ఖాన్ కాగా వీళ్లిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే.1991 సంవత్సరం అక్టోబర్ నెల 25వ తేదీన షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ ల ప్రేమ వివాహం జరిగింది.స్కూలింగ్ సమయంలోనే గౌరీ ఖాన్, షారుఖ్ ఖాన్ ప్రేమలో పడగా వీళ్లిద్దరి ప్రేమ వివాహానికి మొదట గౌరీ ఖాన్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

గౌరీ ఖాన్ తల్లిదండ్రులను ఒప్పించడానికి షారుఖ్ ఖాన్ ఎంతో శ్రమించారు.

Telugu Shah Rukh Khan, Vikranth-Movie

గౌరీ ఖాన్ సోదరుడు విక్రాంత్ షారుఖ్ ఖాన్ ను ఏకంగా గన్ తో బెదిరించారని సమాచారం.అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినా షారుఖ్ ఖాన్ మాత్రం భయపడలేదు.షారుఖ్ తన తండ్రికి ప్రేమ విషయం చెప్పగా షారుఖ్ తండ్రి గౌరీ ఖాన్ తల్లిదండ్రులతో మాట్లాడటంతో పాటు గౌరీ ఖాన్ తల్లిదండ్రులు అంగీకరించడంతో షారుఖ్ గౌరీల వివాహం జరిగింది.

షారుఖ్ గౌరీ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

షారుఖ్ ఖాన్ పలు టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించారు.

విపత్తులు సంభవించిన సమయంలో ఆదుకోవడంలో షారుఖ్ ఖాన్ ముందువరసలో ఉంటారు.ఈ మధ్య కాలంలో షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube