చరిత్రాత్మక విజయం ఇచ్చిన బద్వేల్ ప్రజలకు కృతజ్ఞతలు..సజ్జల రామకృష్ణారెడ్డి

76.24 శాతం ఓట్లు మాకు వచ్చాయి.బద్వేల్ ఫలితం మా బాధ్యతను మరింత పెంచింది.సాంకేతికంగా టీడీపీ పోటీలో లేకపోయినా బీజేపీ అభ్యర్థిని భుజాన వేసుకుంది.చాలా వరకూ పోలింగ్ స్టేషన్ల లో టీడీపీ వాళ్లే ఏజెంట్లుగా ఉన్నారు.బీజేపీ పంచిన ప్రతీ కరపత్రంలోనూ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది ఓటమి ముందే గ్రహించి టీడీపీ, జనసేన లు అభ్యర్థుల్ని పెట్టలేదు.

 Thanks To The People Of Badwell Who Gave A Historic Victory.sajjala Ramakrishnar-TeluguStop.com

గోరంగా ఓడిపోతే పరువుపోతుందని ఆ రెండు పార్టీలు సేఫ్ గేమ్ ఆడుతున్నాయి.రెండున్నారేళ్లుగా సీఎం జగన్ చేసిన సంక్షేమ పాలనని ప్రజలకు వివరించాం.

సీఎం జగన్ పై చంద్రబాబు అండ్ కో చేస్తున్న అసత్యా ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు.తప్పుడు ప్రచారమే తప్ప ప్రజల్లోకి వచ్చి బలం చూపించుకునే దమ్ము వీరికి లేదు.

మిగిలిన మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రాబోతున్నాయి.కుప్పంలో జరిగిన చంద్రబాబు పర్యటన కామెడీ షో లాంటిది.

బద్వేల్ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో అందరూ చూసారు.

సోము వీర్రాజు అన్నట్టు అరాచకాలు, దొంగ ఓట్లు జరిగితే బయటకి వచ్చేవి కదా.ఎలాంటి ప్రలోభాలు జరగలేదని సోము వీర్రాజుకి తెలుసు.జరగలేదు కనుకే బీజేపీకి 24 వేల ఓట్లు వచ్చాయి.

గత ఎన్నికల్లో 700 మాత్రమే వచ్చాయి.అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో జరిగే పాదయాత్ర సంగీభావం తెలిపిన నాయకులు మూడు ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకమా అల్లర్లు సృష్టించి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇలాంటి పాదయాత్రలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి.తిరుపతికి వెళ్లే దారిలో ఎవరైనా రాయలసీమ వారు అడ్డుకుంటే గొడవలు జరగవా ఎవరు బాధ్యత వహిస్తారు దేవస్థానం అంటే పక్కనే అమ్మవారి గుడి ఉంది అక్కడికి వెళ్లొచ్చు కదా.అమరావతి అనేది పెద్ద రియర్ ఏస్టేట్ వ్యాపారం.అక్కడి నిజమైన రైతుల్ని మోసం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube