పవన్ కల్యాణ్ పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మార్మోగిపోతోంది.మొన్నటి దాకా సైలెంట్ గానే వ్యూహాలు రచించిన పవన్ ఇప్పుడు వాటిని అమలు చేసే పనిలో పడ్డారు.మాటల్లో చేతల్లో మంచి స్పీడు పెంచేశారు పవన్ కల్యాణ్.పక్కా వ్యూహంతో కరెక్టు టైమ్ లో ఎక్కడ దిగాలో అక్కడి దిగిపోతున్నారు.ఎవరిని టార్గెట్ చేయాలో వారిని చేసేస్తున్నారు.లెక్క పక్కాగా ఉంటే చూసుకుని గురి చూసి కొడుతున్నారు.
మొన్నటికి మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా వెళ్లిన పవన్ కల్యాణ్ ఆ మీటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పూర్తిగా రాజకీయ బద్ధంగా కామెంట్లు విసిరారు.
ఈ కామెంట్లు కాస్తా ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తున్నాయి.ఇంకా చెప్పాలంటే తమ్ముళ్లు ఫుల్ సీరియస్ గా ఉన్నారు.ఎందుకంటే మొన్నటి వరకు తమతో పవన్ కల్యాణ్ కలిసి వస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ తమను టార్గెట్ చేయడమేంటని మండిపడుతున్నారు.మొన్న ఆయన ధర్నా మీటింగ్ లో మాట్లాడుతూ ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల నడుమ మ్యాచ్ ఫిక్సింగ్ జరుగిందని, ఇద్దరూ కలిసి స్టీల్ ప్లాంట్ విషయంలో నాటకం ఆడుతున్నారంటూ మండిపడ్డారు.
దీంతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా రంగంలోకి దిగిపోయారు.
తాము ఏపీలో వైసీపీ పాలనను అంతం చేసేందుకు పోరాడుతున్నామని అలాంటప్పుడు తమకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటూ మండిపడ్డారు.పవన్ చేసే కామెంట్స్ చివరకు వైసీపీకే మేలు చేస్తున్నాయంటున్నారు.మ్యాచ్ ఫిక్స్ మాటలు ప్రజల్లోకి వెళ్తే తమ పార్టీకి నష్టం జరిగి అంతిమంగా వైసీపీకి మేలు జరుగుతుందంటూ ఆయన వాపోతున్నారు.ఇది నిజమే.ఎందుకంటే ఇప్పటికే టీడీపీ బీజేపీతో కలిసేందుకు ప్రయత్నిస్తోందనే వాదన వినిపిస్తోంది.ఇలాంటి సమయంలో బీజేపీ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తుందటే టీడీపీ వారికి మద్దతు ఇస్తోందనే వాదన వైసీపీ వినిపించే అవకాశం ఉంది.
కాబట్టి పవన్ స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీని విమర్శిస్తే అంతిమంగా వైసీపీకి లాభం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.