యాలకుల ధర చాలా ఎక్కువగా ఉండటానికి కారణాలివే..!

సువాసన ద్రవ్యాల రాణిగా పిలిచే యాలకులను స్వీట్స్ నుంచి టీ వరకు విరివిగా వాడేస్తుంటారు.వీటిలో ఉండే ఔషధ గుణాలు పలు అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెడతాయి.

 These Are The Reasons Why The Price Of Yalaks Is So High Elachi, Cost, Decrease-TeluguStop.com

అందుకే వీటిని ఆయుర్వేద మందుల్లో కూడా విస్తృతంగా వాడుతుంటారు.అయితే యాలకులు కొనుగోలు చేయాలంటే చాలా మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.

వీటి ఖరీదు ఎక్కువగా ఉండడానికి చాలా కారణాలున్నాయి.

ముఖ్యంగా యాలకుల సాగు అనేది చాలా కష్టతరంతో కూడుకున్న పని.ఒక రైతు తన పంట ద్వారా ఆరు కిలోల ముడి యాలకులు పండిస్తే దానిలో కేవలం ఒక కిలో యాలకులు మాత్రమే వినియోగానికి పనికొస్తాయి.మిగతా అన్ని యాలకలు పారేయ్యాల్సిందే.

అలాగే యాలకుల చెట్లు మనుగడ నేల తేమశాతం పై ఆధారపడి ఉంటుంది.నిర్విరామంగా నేల తేమగా ఉంటేనే యాలకుల సాగు సాధ్యపడుతుంది.

అలాగని నీటిముంపు ఎక్కువగా ఉంటే పంట నష్టం తప్పదు.దీన్ని భారతదేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సహా కొన్ని ఇతర దేశాల్లో కూడా పండిస్తారు.

Telugu Cost, Elachi, Karnataka, Kerala, Latest, Latest Ups-Latest News - Telugu

కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు యాలకులు పసుపు, ఆకుపచ్చ రంగులోకి మారుతాయి.అప్పుడు వాటిని చెట్టు కొమ్మలతో సహా సేకరించాల్సి ఉంటుంది.ఈ పని యంత్రాలు చేయడానికి వీలుపడదు.అందుకే కూలీల సహాయంతో యాలకులను కోత ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.కోత అయిపోయిన తరువాత యాలకులను ఐదు నుంచి ఆరు రోజుల వరకు ఆరబెట్టి మధ్యలో వాటిని కదిలిస్తూ ఉండాలి.దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా కార్మికులను నియమించుకోవడం తప్పనిసరి.

మొత్తంగా చూసుకుంటే ఒక హెక్టారు సాగులో కేవలం 5-7 కిలోల యాలకులు మాత్రమే లభిస్తాయి.

Telugu Cost, Elachi, Karnataka, Kerala, Latest, Latest Ups-Latest News - Telugu

అంతేకాదు, యాలకుల పంట సిద్ధం కావడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుంది.ఈ మూడు సంవత్సరాల కాలంలో పంట సాగుకు అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది.అందుకే ఆ ఖర్చులకు తగినట్టుగా రైతులు యాలకలను విక్రయిస్తుంటారు.ప్రస్తుతం మార్కెట్లో కిలో యాలకులను రూ.1000 నుంచి రూ.6 వేల లోపు విక్రయిస్తున్నారు.కాగా సగటున కేజీ యాలకులను రూ.3వేలుగా నిర్ణయిస్తారు.అయితే వీటిలో మనకు నచ్చిన మంచి నాణ్యత గల యాలకులను కొనుగోలు చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది.యాలకుల పంట సాగు శ్రమతోపాటు కష్టంతో కూడుకున్నదే.కానీ వీటిని ఉత్పత్తి చేయకపోతే చాలా వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.అందుకే ఇప్పటికీ వీటిని చాలా మంది రైతులు పండిస్తూనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube