హుజూరాబాద్‌లో గెలిచింది బీజేపీ కాద‌ట‌.. తెర‌మీద‌కు కొత్త విధానాలు..

హుజూరాబాద్ రాజ‌కీయాలు రాష్ట్రంలో కొత్త త‌ర‌హా విధానాల‌ను తెర మీద‌కు తెచ్చాయి.అందరూ ఊహించిన‌ట్టుగానే అక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న విజ‌యం సాధించారు.

 Bjp Did Not Win In Huzurabad .. New Policies On Screen .., Huzurabad, Bjp-TeluguStop.com

అయితే ఇంత మెజార్టీ వ‌స్తుంద‌ని బ‌హుశా బీజేపీ నేత‌లు కూడా ఊహించ‌లేదు.అనూహ్యంగా ఎక్క‌డా శ‌ష‌బిష‌ల‌కు తావివ్వ‌కుండా సంపూర్ణ‌మైన మెజార్టీని ఆయ‌న‌కు ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టారు.

అయితే ఇక్క‌డే ఓ కొత్త విధానాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.నిజానికి ఎవ‌రు ఔన‌న్నా కాద‌న్నా ఇక్క‌డ ఈట‌ల చ‌రిష్మాకు ఓట్లు ప్డ‌డాయి.

ఆయ‌న ఎత్తుకున్న ఆత్మగౌర‌వ నినాదానికి అంద‌రూ మ‌ద్ద‌తు ప‌లికారు.

అంతేగానీ బీజేపీని చూసి మాత్రం ఓట్లు ప‌డ‌లేదు.

ఇదే విష‌యాన్ని నిన్న చాలామంది నేత‌లు చెబుతున్నారు.ఈట‌ల త‌న ఇమేజ్ తో గెలిచారు త‌ప్ప బీజేపీ హ‌వా మాత్రం కాద‌ని అంటున్నారు.

ఇంకొంద‌రు అయితే అక్క‌డ గెలిచింది బీజేపీ కాద‌ని, ఈట‌ల రాజేంద‌ర్ అంటూ ప్ర‌క‌టించేస్తున్నారు.కాంగ్రెస్ నేత‌లు ఇదే విష‌యాన్ని నొక్కి మ‌రీ చెబుతున్నారు.

అంతే కాదు అక్క‌డ ఓడిపోయింది కూడా గెల్లు శ్రీనివాస్ కాద‌ట‌.కేసీఆర్ అని అంటున్నారు.

ఎందుకంటే కేసీఆర్ పంతం ప‌ట్టి మ‌రీ అన్నీ తానై చూసుకున్నారు.

Telugu Cm Kcr, Congress, Eetala Rajendar, Gellusrinivas, Huzurabad, Tg-Telugu Po

త‌న‌కు న‌చ్చిన అభ్య‌ర్థిని దింపి త‌న నిర్ణ‌యాల‌ను అమ‌లు అయ్యేలా చూశారు.

చేరిక‌ల ద‌గ్గ‌రి నుంచి ద‌ళిత‌బంధు దాకా అంతా కేసీఆర్ ఐడియాల‌జీ తోనే న‌డిచింది.ఒక ర‌కంగా చెప్పాలంటే ఇక్క‌డ పోటీ ఈట‌ల రాజేంద‌ర్‌కు కేసీఆర్‌కు మ‌ధ్య జ‌రిగింద‌ని, బీజేపీకి వ‌ర్సెస్ టీఆర్ ఎస్ కాద‌ని అంటున్నారు రాజ‌కీయ నేత‌లు.

హుజూరాబాద్ లో గెలిచింది ఈటల రాజేందర్ ఆత్మ గౌర‌వ నినాదం అని ఆ క్రెడిట్ ను బీజేపీ ఖాతాలో వెయ్య‌డానికి వీలుండ‌ద‌ని చెబుతున్నారు.ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి క‌నీసం డిపాజిట్ కూడా రాలేద‌ని గుర్తు చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube