అక్కినేని హీరో అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన టాక్ పాజిటివ్ గా రావడంతో సినిమా కు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.
అఖిల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆరు ఏళ్లు అవుతుంది.ఇన్నాళ్లకు ఒక మంచి కమర్సియల్ బ్రేక్ దక్కింది.
అద్బుతమైన కమర్షియల్ సినిమా ను అఖిల్ చేస్తాడని అంతా ఆశించారు.అన్నట్లుగానే ఒక మంచి సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేయడం జరిగింది.
అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది.
దసరా బరిలో మూడు సినిమాల్లో ఒక సినిమా గా విడుదల అయిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యి.దసరా విజేతగా నిలిచింది.
భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.50 కోట్ల రూపాయలను ఈ సినిమా దక్కించుకుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
మొదటి 7 రోజుల్లో ఈ సినిమా 40 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుంది.అందులో షేర్ 24.6 కోట్లు గా చెబుతున్నారు.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కు చేరువ అయిన ఈ సినిమా మరో పది కోట్ల వరకు రాబడితే ఖచ్చితంగా అద్బుతం అంటారు.
ఎందుకంటే ఈమద్య కాలంలో సినిమా లు పాతిక కోట్లు వసూళ్లు సాధిస్తే చాలా పెద్ద విషయంగా చెప్పుకుంటున్నారు.అలాంటిది బ్యాచిలర్ అంత భారీ వసూళ్లు దక్కించుకుంటే ఇక రికార్డు అనకుండా మరేం అంటారు చెప్పండి.
అఖిల్ కు మొదటి కమర్షియల్ సక్సెస్ దక్కినందుకు ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉంది.