ఈ అనంత సృష్టిలో ప్రతి ప్రాణిని ప్రాణంగా ప్రేమించేది ఒక్క తల్లి మాత్రమే.బిడ్డకు ఆపద వచ్చిందంటే చాలు తన ప్రాణాలను అడ్డు వేసి మరీ పోరాడుతుంది.
అలాంటి తల్లి ప్రేమ ముందు ఎలాంటి ఆపద అయినా తోక ముడువాల్సిందే.అందుకేనేమో తల్లి ప్రేమకు ఏదీ కొలమానం కాదని చెబుతుంటారు.
పిల్లలను కంటికి రెప్పలా, పంటకు కంచెలా కాపాడుకునేది ఒక్క తల్లి మాత్రమే.తల్లి ప్రేమకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి.
ఇకపోతే ఇప్పుడు కూడా ఇలాంటి ఓ తల్లి ప్రేమకు నిదర్శనంగా చెప్పుకునే వీడియో గురించి మీకు చెప్పబోతున్నాం.
ఇక ఇప్పుడు ఈ వీడియోలో ఓ తల్లి కోడి తన కోడిపిల్లల కోసం చేసిన పోరాటం గురించి తెలుసుకుందాం.
ఏ జంతువు అయినా లేదంటే పక్షులు అయినా సరే పిల్లలను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తాయి.మనం ఇదివరకే తల్లి కోడి తన పిల్లలను కాపాడుకునేందకు పాము లేదంటే ఇతర ప్రమాదకర జంతువులతో పోరాడినవి చూశాం.
ఈ సారి మాత్రం గద్దతో పోరాడింది ఓ కోడి.ఈ వీడియోలో మనం జాగ్రత్తగా చూస్తే ఓ కోడి ఓ చోట తన పిల్లలను చూసుకుంటూ ఉండగా ఇంతలో సడెన్ గా ఓ డేగ అక్కడకు వచ్చి పిల్లలను ఎత్తుకుని పోవాలని చూస్తుంది.
దీంతో తల్లి కోడికి కోపం వచ్చి వెంటనే ఆ డేగతో పోరాటానికి దిగుతుంది.గద్దతో ఫైట్ చేసి మరీ తన పిల్లలను కాపాడుకునే ప్రయత్నం అంతా ఇంతా కాదు.ఇక తల్లి కోడి పోరాట పఠిమకు దెబ్బకు డేగ భయపడి తప్పించుకని పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది.కానీ తల్లి కోడి మాత్రం వెనక్కు తగ్గకుండా ఆ డేగను ముప్పుతిప్పలు పెట్టింది.
ఇదంతా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డు కావడంతో కోడి సాహసాన్ని చూసి దాని తల్లి ప్రేమకు అంతా మెచ్చుకుంటున్నారు.ఇప్పటికే దీన్ని లక్షలాది మంంది చూశారు.నిజంగా తల్లి ప్రేమ అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు.