ఎందుకో తెలియదు కానీ సినీ ఇండస్ట్రీలో నటీనటులకు మాత్రం పెళ్లి అనగానే ఎక్కడ లేని కోపం ముంచుకువస్తుంది.ఇప్పటికీ ఎంతోమంది నటీనటులు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
నిజానికి వారికి ఒంటరి జీవితమే చాలా అద్భుతమైన జీవితమని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలలో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురైనప్పుడు ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా హీరోయిన్స్ మాత్రం పెళ్లి విషయంలో అస్సలు ఆసక్తి చూపరు.
వాళ్లకు మీడియా ఎదురుపడితే చాలు.మీడియా నుండి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు ఎదురవుతాయి.
కొంతమంది తమ పెళ్లి గురించి అసలు ఓపెన్ అవ్వరు.మరికొంతమంది మా పెళ్లి గురించి మీకెందుకు అంటూ నేరుగా తిట్టిపోస్తారు.
ఇదిలా ఉంటే వయసొచ్చిన హీరోయిన్ ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని సలహా ఇవ్వడంతో.ఏకంగా చెంప చెల్లుమనిపించింది ఆ హీరోయిన్.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.
బాలీవుడ్ సుందరి సుస్మితాసేన్.
తన అందంతో మిస్ యూనివర్స్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాను సంపాదించుకుంది.హిందీతో పాటు తెలుగు, తమిళ భాషలో కూడా నటించింది.
ఇక ఇప్పటికీ ఈమె అందంలో ఎటువంటి మార్పు లేదు.ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.
కానీ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారిని పెంచుకుంటుంది.వాళ్లకి సింగిల్ మదర్ గా ఉండిపోయింది.
ఈమె ఎక్కడ కనిపించినా కూడా ఈమెను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని తెగ ప్రశ్నలు వేసి విసిగించే వాళ్ళు.కానీ ఈమె మాత్రం పెళ్లి గురించి అస్సలు స్పందించదు.కానీ గతంలో ఓసారి తానే నేరుగా తన పెళ్లి గురించి ఓ అభిప్రాయాన్ని తెలిపింది.పెళ్లిపై ఒక్కొక్కరికి ఉన్న అభిప్రాయాన్ని గౌరవిస్తాను అంటూ కానీ తనకు ఒంటరిగా జీవించడంలో ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది.
అయినా కూడా ఈమెకు పెళ్లి గురించి మాత్రం ప్రశ్నలు ఆగలేదు.ఇదిలా ఉంటే గతంలోనే ఈమెను ఒకరు నేరుగా పెళ్లి గురించి ప్రశ్నించే సరికి వాళ్ల చెంప చెల్లుమనిపించింది.
ఈమె తన 34వ పుట్టినరోజు వేడుకలకు తన స్నేహితులను, సన్నిహితులను ఆహ్వానించింది.ఇక పార్టీ మొత్తం మంచి ఎంజాయ్ ఫుల్ గా జరుగుతుండగా ఒకేసారి వైలెంట్ శబ్దం వినిపించింది.
అందరూ ఒకేసారి సైలెంట్ అయి చూసి ఏం జరిగింది అని అడిగేసరికి అసలు విషయం బయటపడింది.
ఆ వేడుకకు వచ్చిన ఒక యువతి సుష్మితా సేన్ ను.34 ఏళ్లు వచ్చాయి కదా ఇకనైనా పెళ్లి గురించి ఆలోచించవచ్చు కదా అని అడిగిందట.దాంతో సుస్మితా కు ఎక్కడ లేని కోపం వచ్చి ఆ వేడుకలోనే ఆమె చెంప చెల్లుమనిపించిందట.
అంతేకాకుండా ఓ రేంజ్ లో బూతు మాటలు కూడా తిట్టిందట సుష్మిత.ఇక వేడుకకు వచ్చిన వాళ్ళందరూ ఇక రచ్చ పెద్దగా జరుగుతుంది అని అనుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయారట.