1.పెరగనున్న దుబాయ్ విమాన టిక్కెట్ల ధరలు
యూఏఈ భారత్ మధ్య విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి.దీనికి కారణం వచ్చే వారం ప్రారంభం కానున్న దుబాయ్ ఎక్స్ పో.దీనికి భారత్ నుంచి భారీగా సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.దీని కారణంగానే టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు విమాన సంస్థలు భావిస్తున్నాయి.
2.డబుల్ యూనివర్సిటీలో మహిళలకు నో ఎంట్రీ
కాబూల్ యూనివర్సిటీలో తాలిబన్లు నియమించిన ఛాన్స్ లర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక యూనివర్సిటీలో తరగతులకు హాజరు కావడానికి పనిచేయడానికి మహిళలకు అనుమతి లేదని యూనివర్సిటీ ఛాన్సలర్ మహ్మద్ ఆఫ్రాస్ ఘైరాట్ ప్రకటించారు.
3.కరోనా కట్టడికి ఫైజర్ టాబ్లెట్
కరోనా ను కట్టడి చేసేందుకు ఓ యాంటీ వైరల్ టాబ్లెట్ ‘ ఫైజర్ ‘ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానుంది.
4.దుబాయ్ ఎక్స్ పో
దుబాయ్ ఎక్స్ పో అక్టోబర్ 1 న ప్రారంభమై వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు కొనసాగనుంది.
5.బూస్టర్ డోస్ తీసుకున్న బైడన్
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కోవిడ్ -19 బూస్టర్ డోస్ తీసుకున్నారు.
6.తానా సాహితీ సదస్సు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సాహితీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న నెల నెలా తెలుగు వెలుగు సాహిత్య సమావేశం సెప్టెంబర్ 26 న విజయవంతంగా జరిగింది.
7.లండన్ లో బతుకమ్మ వేడుకలు.పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ జాగృతి లండన్ విభాగం ఆధ్వర్యంలో జరిగే మెగా బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు.
8.కుక్కల మాంసం తినడం పై ఆ దేశంలో నిషేదం
కుక్కల మాంసం తినడం పై నిషేధం విధించారు దక్షిణకొరియా ప్రెసిడెంట్ మూన్ జే ఇన్.
9.షార్ట్ రేంజ్ మిస్సైల్ పరీక్షించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా ఈ రోజు స్వల్ప స్థాయి మిస్సైల్ ను పరీక్షించింది.
10.భారతీయులపై చైనా ఆంక్షలు
భారతీయులకు దేశాల నిరాకరణ ను చైనా సమర్థించుకుంది కరోనా కారణంగా చైనా నుంచి భారత్ చేరుకున్న వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తిరిగి తమ దేశంలోకి రానివ్వకుండా వీసా నిబంధనలు పెట్టింది.
దీనిపై చైనాలో భారత రాయబారి విక్రమ్ మిశ్రి ఈ నిబంధనల పై అసంతృప్తి వ్యక్తం చేశారు.దీనిని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సమర్ధించారు.