తెలుగులో ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన “కాంచనమాల కేబుల్ టీవీ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైన కన్నడ బ్యూటీ “లక్ష్మీరాయ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే కేవలం హీరోయిన్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించి కూడా బాగానే ప్రేక్షకులను అలరించింది.
అయితే ఇప్పటివరకు నటి లక్ష్మీరాయ్ కేవలం గ్లామర్ రోల్స్ లో ఎక్కువగా నటించడంతో తన నటనా ప్రతిభను నిరూపించుకునే స్కోప్ లేకపోయింది.దీంతో ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో గ్లామర్ కంటే తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశాలను పంచుకుంటోంది.
కాగా ప్రస్తుతం నటి లక్ష్మీరాయ్ తమిళ భాషలో “సిండ్రెల్లా” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి తమిళ ప్రముఖ దర్శకుడు “వెంకటేశన్” దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ఈ చిత్రం హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడంతో నటి లక్ష్మీరాయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది.అయితే ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ఈ అమ్మడు తన పాత్ర కోసం ఏకంగా 25 కేజీల బరువున్న “సిండ్రెల్లా గౌను దుస్తులను” ధరించి తన పాత్రకు న్యాయం చేసేందుకు చాలా కష్ట పడిందని ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.
అంతేకాకుండా ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి హర్రర్ ఘోస్ట్, వర్కర్ మరియు రాక్ స్టార్ తదితర మూడు పాత్రలలో నటించి తన హావభావాలు పలికించినట్లు సమాచారం.కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తారీఖున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.
మరి లక్ష్మీ రాయ్ సిండ్రెల్లా చిత్రంతో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళం, కన్నడ, తదితర భాషలలో మాత్రం బాగానే సినిమా అవకాశాలు వస్తున్నాయి.కాగా ప్రస్తుతం రాయ్ లక్ష్మి కన్నడ భాషలో కూడా “ఝాన్సీ ఐపీఎస్” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం.