మారుతి, సంతోష్ శోభన్ కాంబినేషన్‌లో ‘మంచి రోజులు వచ్చాయి’ నుంచి ఎనర్జిటిక్ 'ఎక్కేసిందే' ప్రోమో సాంగ్ కు అనూహ్య స్పందన..

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, సోసోగా ఉన్నా పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.

 Unexpected Response To The Energetic 'ekkesinde' Promo Song From 'manchi Rojulu-TeluguStop.com

ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ మెయిన్ లీడ్ చేస్తున్నారు.మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు.టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది.మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్.

ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది.

ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్.తాజాగా ఈ సినిమా నుంచి ఎక్కేసిందే ప్రోమో సాంగ్ విడుదలైంది.

సంతోష్ శోభన్, మెహరీన్ డాన్స్ ప్రోమోలో హైలైట్ అయింది.సెప్టెంబర్ 23న ఫుల్ సాంగ్ విడుదల కానుంది.

ఈ ప్రోమో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది.సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube