తెలంగాణ బీజేపీ ఇప్పుడు మంచి జోష్‌లో ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఇన్ని రోజుల వరకు కాంగ్రెస్‌లోనే గ్రూపు రాజకీయాలు ఉంటాయని అనుకుంటే ఇప్పుడు బీజేపీలో కూడా ఆధిపత్యం పోరు మొదలైనట్టు కనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా బండి సంజయ్ దూకుడును సీనియర్లు ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది.అందుకే ఆయన ఇమేజ్ ను మరింత పెంచేందుకు వారు పెద్దగా కృషి చేయట్లేదని తెలుస్తోంది.
ఇకపోతే ఇప్పుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు కూడా వారు పెద్దగా కలిసి రావట్లేదు.మిగతా విషయాల్లో కూడా పెద్దగా మద్దతు ఇవ్వట్లేదు.
ఇక బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర బాగా పాపులర్ కావడంతో జాతీయ నాయకులు కూడా పాల్గొనడంతో ఆయన యాత్రకు అమాంతం క్రేజ్ వచ్చేఇసంది.ఇక దీన్ని జాతీయ మీడియా కూడా బాగానే కవర్ చేస్తోంది.
అయితే పార్టీ అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న పాదయాత్రకు సీనియర్లు మాత్రం పెద్దగా సపోర్టు చేయట్లేదంట.మరీ ముఖ్యంగా మొన్న ఆయన గ్రేటర్‌లో పాదయాత్ర చేసినప్పుడు మాత్రం కనీసం పదిమంది కార్పొరేటర్లు కూడా ఆయన వెంట లేకపోవడం పెద్ద మైనస్.
ఇకపోతే ఇతర జిల్లాల్లో కూడా ఆయనకు కలిసి రావట్లేదు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బండికి పెద్దగా సపోర్టు చేయట్లేదు.
మొదటి రోజు కనిపించిన పెద్ద లీడర్లు ఆ తర్వాత ఎక్కడ కూడా కనిపించకపోవడం గమనార్హం.ఇక హుజూరాబాద్‌లో కూడా ఈటల రాజేందర్ ఒంటరిగానే ప్రచారం చేసుకుంటున్నారు.
బీజేపీ సీనియర్లు ఎవరూ పెద్దగా ప్రచారానికి రాకపోయినా కూడా ఆయన ఒంటరి ప్రయాణమే చేస్తున్నారు.దీంతో బీజేపీలో రెండు గ్రూపులుగా రాజకీయం నడుస్తోందని అంతా చెబుతున్నారు.
మరి ఇది బండి సంజయ్‌కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.ఇక రాబోయే రోజుల్లో బీజేపీ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.