పోడు భూముల వ్యవహారం రాష్ట్రంలో పరిష్కారం కాని అతి పెద్ద సమస్యలలో ఒకటి.ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల పోడు భూముల సమస్యకు పరిష్కారం లభించడం లేదు.
దశాబ్ద కాలంగా గిరిజనులు భూమి సాగు చేసుకుంటున్నారు.అయితే అది అటవీ భూమి అని గిరిజనులకు అటవీ అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి.
ఇక అటవీ అధికారుల వేధింపులు తాళలేక కొంత మంది రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటనలు కూడా మనం చూశాం.అయితే ఈ పోడు భూముల సమస్యను త్వరితగతిన పరిష్కారం చేస్తానని గత ఎన్నికల ప్రచార సభలలో కెసీఆర్ నొక్కివక్కాణించి చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే.
అయితే ఇప్పటివరకు ఈ పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపించిన పరిస్థితి, ప్రభుత్వం నుండి కూడా అటువంటి ముందడుగు ఏమీ కనిపించలేదు.క్షేత్ర స్థాయిలో ఈ సమస్య తీవ్రతరమవుతున్నదని గమనించిన ప్రభుత్వం తాజాగా ఈదుగురు మంత్రులతో కలసి కమిటీ వేసింది.
ఈ విషయాన్ని కెసీఆర్ అత్యవసర పరిష్కార సమస్యగా గుర్తించకపోతే టీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.ఎందుకంటే ప్రతి రైతు తన ప్రాణాన్నైనా వదులుకోవడానికైనా సిద్దపడతాడు కాని తనకు ఉన్న ఇంచు భూమిని కూడా వదులుకోవడానికి ఇష్టపడడు.
మరి ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందనేది చూడాల్సి ఉంది.