ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో సాయి ధరమ్ తేజ్ కు చికిత్స జరుగుతోంది.
సృహలోకి వచ్చిన తర్వాత సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఒకే ఒక్క మాట మాట్లాడాడని సమాచారం.వైద్యులు వీడియో కాల్ ద్వారా సాయి ధరమ్ తేజ్ కు ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే అవకాశం కల్పించారు.
వీడియో కాల్ లో సాయి ధరమ్ తేజ్ “నొప్పిగా ఉంది” అనే మాటను మాత్రమే మాట్లాడారని సమాచారం.ప్రస్తుతం సాయితేజ్ మాట్లాడే పరిస్థితిలో లేరని వైద్యులు చెబుతున్నారు.
కుటుంబ సభ్యులు చూస్తామని అడిగినా డాక్టర్లు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.మరోవైపు సాయితేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా హీరోలు పోస్టులు పెడుతున్నారు.
మరి కొందరు సినీ ప్రముఖులు సాయి ధరమ్ తేజ్ ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.
సాయితేజ్ కు జరిగిన ప్రమాదం గురించి ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాయితేజ్ పై కేసు నమోదు చేస్తే ఇసుకు పేరుకుపోవడానికి కారణమైన కాంట్రాక్టర్ పై, రోడ్లను సరిగ్గా శుభ్రం చేయని మున్సిపాలిటీ వాళ్లపై కూడా కేసులు నమోదు చేయాలని ఆర్పీ పట్నాయక్ కామెంట్లు చేశారు.అయితే ఈ వ్యాఖ్యలపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

సీనియర్ నరేష్ చేసిన కామెంట్ల వల్ల బైక్ రేసింగ్ కూడా ప్రమాదానికి కారణం కావచ్చనే కామెంట్లు వినిపించాయి.సాయితేజ్ కోలుకుని స్పందిస్తే మాత్రమే ప్రమాదానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది.మరో ఒకటి రెండు రోజుల్లో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది.సాయితేజ్ నటించిన రిపబ్లిక్ త్వరలో రిలీజ్ కానుంది.