తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.2017 లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన టాలీవుడ్ లోని అగ్ర తారలను సైతం వణికించింది.అందులో భాగంగా సిట్ తన విచారణను సాగించినప్పటికీ కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సెలబ్రెటీలందరూ ఊపిరి పీల్చుకున్నారు.కానీ ఈ సారి విచారణను సవాలుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం గట్టిగానే తమ విధిని నిర్వర్తిస్తుందేమో అన్పిస్తుంది.
ఈ క్రమంలో ముందు 12 మందికి నోటీసులు జారీ చేయగా వారందరూ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పేర్కొంది.ఇలా ప్రారంభమైన ఇన్వెస్టిగేషన్ సెప్టెంబర్ 31 నుంచి మొదలైంది.
ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు రవితేజ నేడు విచారణకు హాజరైనారు.ఆయనతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా ఈడీ ప్రశ్నించనుంది.
ఈ సారి ఈడీ ప్రముఖుల ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మీ, రకుల్,నందు, రానాలను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.నందు, రానాలను మాత్రం డ్రగ్ సప్లయర్ కెల్విన్ సమక్షంలో ప్రశ్నించినట్టు అర్థమవుతుంది.దీంతో నేడు మరోసారి… కెల్విన్ కూడా ఈడీ విచారణకు హాజరు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.