బిగ్ బాస్ లో రవి ఎంట్రీకి కారణం ఆమేనా.. రికమెండ్ చేయడంతో?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ప్రేక్షకులను ఎక్కువగా రవి ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.రవికి సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Interesting Facts About Bigg Boss Contestant Ravi, Bigg Boss Contestant, Intere-TeluguStop.com

రవి కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్లలో ఉంటారని కొంతమంది భావిస్తుంటే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ రవి అని కామెంట్ చేస్తున్నారు.అయితే బిగ్ బాస్ సీజన్ 5లో రవి ఎంట్రీకి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 5లో రవికి ఛాన్స్ రావడానికి గతంలో అతనితో కలిసి షోలు చేసిన ఒక యాంకర్ కారణమని ఆ యాంకర్ తనకు ఉన్న పరిచయాలతో రవికి ఛాన్స్ ఇప్పించిందని తెలుస్తోంది.ఆ యాంకర్ రికమెండ్ చేయకపోతే రవికి ఛాన్స్ దక్కేది కాదని సమాచారం.

మరోవైపు గత సీజన్ లో అభిజిత్ విన్నర్ కావాలనే ఉద్దేశంతో రవి ఎంతో కష్టపడిన సంగతి తెలిసిందే.మరి రవి విన్నర్ కావడానికి అభిజిత్ సపోర్ట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

అయితే రవికి షణ్ముఖ్ జశ్వంత్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటం గమనార్హం.

Telugu Abhijee, Anchor, Anchor Ravi, Anchorravi, Biggboss, Hameeda, Jessie, Ravi

వెబ్ సిరీస్ లలో నటించడం ద్వారా షణ్ముఖ్ జశ్వంత్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చింది.అతనికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఈ షోకు రప్పించారనే కామెంట్లు సైతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి.యాక్టివ్ గా లేకపోవడం షణ్ముఖ్ కు మైనస్ అవుతుండగా కొన్నిరోజుల తర్వాత షణ్ముఖ్ మారతాడేమో చూడాల్సి ఉంది.

Telugu Abhijee, Anchor, Anchor Ravi, Anchorravi, Biggboss, Hameeda, Jessie, Ravi

షణ్ముఖ్ తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో తాను ఎక్కువ మంది ఉన్న గుంపుతో కలవలేనని తనకు గుంపును చూస్తే భయం వేసుందని చెప్పుకొచ్చారు.మరోవైపు ఈ వారం హమీదా లేదా జశ్వంత్ పడాలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube