తెలుగు బుల్లితెర, వెండితెర నటి హిమజ పరిచయం గురించి అందరికి తెలిసిందే.బుల్లితెరలో పలు సీరియల్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాకుండా వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా కనిపిస్తుంది.
నిత్యం తన ఫోటోలను, వీడియోలను పంచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇంట్లో అద్భుతం జరిగింది అంటూ కొన్ని విషయాలు పంచుకుంది.
భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఇక బుల్లితెరపై పలు షోలలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది.
ఇటీవలే యూ ట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.ఇక అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా పంచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఫేస్ బుక్ వేదికగా ఓ వీడియోను పంచుకోగా అందులో కొన్ని విషయాలు పంచుకుంది.
ఇక అందులో మాట్లాడుతూ.2004 సంవత్సరంలో తమకు రమణానంద మహర్షి అనే ఒక స్వామీజీ పరిచయం అయ్యాడని తెలిపింది.
ఇక తమ కుటుంబం మొత్తం సాయిబాబా భక్తులని.స్వామీజీ పరిచయం కావడంతో 19 రోజులపాటు హోమం చేశామని తెలిపింది.ఆ సమయంలో నిత్య హోమం చేస్తూ సాయి చరిత్ర పారాయణ చేసే వాళ్లమని తెలిపింది.
ఓ రోజు తనకు సాయి బాబా విగ్రహాన్ని శుద్ధి పరిచే డ్యూటీ వచ్చిందని ఆ సమయంలో అద్భుతం జరిగిందని తెలిపింది.
ఒక విగ్రహం చుట్టూ విభూది రాలుతుంది.ఈ విషయాన్ని వెంటనే అక్కడున్న వాళ్లందరికీ పిలిచి చూపించేసరికి విగ్రహం చుట్టూ ఉన్న గోడ నుంచి విభూది ఊరుతుందనే విషయం తనకు అర్థమైందని తెలిపింది.అంతేకాకుండా విగ్రహం శుద్ధి కోసం ఉంచిన నీళ్లు మొత్తం తులసి నీరుగా మారి ఘాటైన తులసి వాసన వచ్చాయని ఇటువంటి అద్భుతాన్ని తన జీవితంలో చూడలేదని తెలిపింది.
ఇక ఈ విషయం గురించి ఏదో నమ్మించడానికి చెబుతున్నాను అని అనుకోకండి అని కొన్ని విషయాలు పంచుకుంది.