నేడు నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ సినిమా కు ది ఘోస్ట్ అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది.
టైటిల్ మరియు పోస్టర్ చూసిన వారు ఏదో తేడా కొడుతుంది అంటున్నారు.ముఖ్యంగా సోషల్ మీడియాలో మీమర్స్ తమ ఇష్టానుసారంగా ఈ సినిమా పోస్టర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
మరీ ఓవర్ గా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ఇదేం రచ్చ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.నాగార్జున ను ఎన్ ఎస్ ఏ ఏజెంట్ పాత్రలో ప్రవీణ్ సత్తారు చూపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాని తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే మాత్రం మరేదో ఉన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
రికార్డ్ స్థాయిలో గతంలో నాగార్జున నటించిన సినిమాలు సక్సెస్ అయ్యాయి.
కాని ఈసారి పరిస్థితి చూస్తుంటే నాగార్జున ఘోస్ట్ సినిమా మరో లెవల్ అన్నట్లుగా ఉంటుందేమో అంటున్నారు.నాగార్జున మరియు కాజల్ లు నటిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటీ అనేది ఈ పోస్టర్ చూస్తుంటే అర్థం అవ్వడం లేదు.
ఇన్నాళ్లు ప్రచారం జరిగినట్లుగా కాకుండా విభిన్నమైన పాత్రలోవిభిన్నమైన కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ సినిమా ను నాగార్జునతో చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ పోస్టర్ లో నాగార్జున చేతిలో కత్తి పట్టుకుని ఉండగా ముందు పెద్ద పెద్ద వారు మోకరిల్లినట్లుగా చూపించారు.కనుక బాబోయ్ ఇదేం రచ్చరా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే అక్కినేని అభిమానులు మాత్రం కన్నుల పండుగ అన్నట్లుగా పోస్టర్ ఉంది.ఖచ్చితంగా నాగార్జునకు ఈ సినిమా మరో లెవల్ అన్నట్లుగా ఉంటుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
మొత్తానికి ఫ్యాన్స్ కు ఈ పోస్టర్ మంచి ఊపు తెప్పిస్తుంది.