కన్నడంలో రూపొందిన కే జీ ఎఫ్ సినిమా కు సీక్వెల్ గా రూపొందిన కే జీ ఎఫ్ 2 సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.కాని కరోనా కారనంగా గత ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.
కరోనా వల్ల సినిమా లు నెలలకు నెలలు వాయిదా పడుతుంటే కే జీ ఎఫ్ 2 మాత్రం ఏకంగా ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతుంది అంటూ టాక్ వినిపిస్తుంది.పెద్ద ఎత్తున అంచనాలున్న కే జీ ఎఫ్ 2 సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారు అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
కాని ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం కే జీ ఎఫ్ 2 నే ఇంకా రిలీజ్ కాలేదు.
అప్పుడే ఎలా సలార్ సినిమా గురించిన చర్చ చేస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.నెట్టింట సలార్ విడుదల గురించి చర్చ జరిగిన ప్రతి సారి కూడా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వారు సినిమా ఇప్పట్లో విడుదల అవ్వదు అంటూ చెప్పకనే చెబుతున్నారు.
వచ్చే ఏడాది చివరికి అంటే ఇంకా ఏడాదికి పైగా సలార్ కోసం వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా సలార్ ను తెరకెక్కిస్తున్నారు.కరోనా సెకండ్ వేవ్ కారణంగా సలార్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వాల్సింది క్యాన్సిల్ అయ్యింది.కే జీ ఎఫ్ 2 సినిమా ను వచ్చే ఏడాది లో విడుదల చేస్తే ఆ తర్వాత సలార్ విడుదల గురించిన చర్చలు మొదలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.