పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చిత్రాన్ని ముగింపు దశకు తీసుకొచ్చిన పవన్, తన నెక్ట్స్ చిత్రాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలోనే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న పవన్, ఈ సినిమా షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.
గతంలో హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించాడు పవన్.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.
ఈ సినిమాతో పవన్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కి తిరుగులేని రికార్డును క్రియేట్ చేశాడు.ఇక ఇప్పుడు మరోసారి హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ సినిమా చేయనుండటంతో, ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అయితే ఈసారి పవన్ కోసం అదిరిపోయే కథను రెడీ చేస్తున్నాడట దర్శకుడు హరీష్ శంకర్.ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా హరీష్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.
కాగా ఈ సినిమాకు టైటిల్ విషయంలో కూడా దర్శకుడు హరీష్ శంకర్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడట.
కథకు అనుగుణంగా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయాలని ఆయన చూస్తున్నాడట.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు ‘సంచారి’ అనే టైటిల్‌ను పెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.అయితే ఈ సినిమాకు ‘ఇప్పుడే మొదలైంది’ అనే టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ పరిశీలిస్తోందట.
ఏదేమైనా పవన్ కళ్యాణ్ కోసం హరీష్ శంకర్ ఏ టైటిల్‌ను ఫిక్స్ చేస్తాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.కాగా గతేడాది పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇక ఈయేడు పవన్ పుట్టినరోజున కూడా ఈ సినిమా నుండి మరో పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.దీంతో పవన్ బర్త్‌డో రోజున ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.
మరి పవన్ కోసం హరీష్ శంకర్ ఏ టైటిల్‌ను ఫిక్స్ చేస్తాడో తెలియాలంటే పవన్ పుట్టినరోజు వరకు వెయిట్ చేయాల్సిందే.