ఇక మీదట 'ఆహా' అన్ని భాషల్లో..!

అల్లు అరవింద్ సారధ్యంలో తెలుగు ఓటీటీ ఆహా సరికొత్త సంచలనంగా మారింది.అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లకు పోటీగా కంప్లీట్ తెలుగు కంటెంట్ తో ఆహా మొదలైంది.

 Aha Ott Expanding All South Languages , Aha, Aha Kannada, Aha Ott Updates, Aha S-TeluguStop.com

ఆహా మొదలైన టైం లో 100 పర్సెంట్ తెలుగు అంటూ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.తెలుగు కంటెంట్ తో వెబ్ సీరీస్, డబ్బింగ్ సినిమాలు, ఇండిపెండెంట్ సినిమాలతో ఆహా తెలుగు ఆడియెన్స్ ను ఆహా అనిపించింది.

అయితే ఆహా ఇప్పుడు విస్తరణకు రెడీ అవుతుంది.కేవలం తెలుగు ఆడియెన్స్ కే కాకుండా ఆహాని ఇప్పుడు సౌత్ అన్ని భాషల్లో విస్తరించాలని చూస్తున్నారు.

ఆహా త్వరలో కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో కూడా సినిమాలు, వెబ్ సీరీస్ లను చేసేలా కంటెంట్ డెవలప్ చేస్తుందట.అందుకే ఆహా కోసం ఈమధ్యనే కొద్దిగా పెద్ద ఆఫీస్ తీసుకున్నారని తెలుస్తుంది.

అంతేకాదు ఒరిజినల్ కంటెంట్ కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.ఆహా ఓటీటీ ఇక మీదట కేవలం తెలుగు మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషల్లో కూడా వస్తుంది.

అక్కడ ఆడియెన్స్ తో కూడా ఆహా అనిపించేందుకు రెడీ అవుతుంది ఆహా. అహా తెలుగులో వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ సినిమాలకు చాలా క్రేజ్ సంపాదించుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube