వెండితెరపై ఒకప్పుడు నటుడిగా, కమెడియన్ గాఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బండ్లగణేష్ అందరికీ సుపరిచితమే.కెరియర్ మొదట్లో కమెడియన్ గా సందడి చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు.
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ఎక్కడ కనిపించినా పవన్ కళ్యాణ్ పొగుడుతూ కనిపిస్తారు.
సోషల్ మీడియా వేదికగా కూడా బండ్ల గణేష్ తాను దైవంగా భావించే పవన్ కళ్యాణ్ గురించి స్పీచ్ ఇస్తూ ఉంటారు.ఇదిలా ఉండగా నిర్మాతగా స్థిరపడిన బండ్ల గణేష్ తిరిగి నటుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీలో ఎంతో విజయాన్ని అందుకొని జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు.
ఆర్.పార్తిబన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒత్త సెరప్పు సైజ్ 7’ సినిమాను తెలుగులో వెంకట్ చంద్ర దర్శకత్వం వహించగా స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.తమిళంలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఈ సినిమా రీమేక్ ద్వారా బండ్ల గణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం వినబడుతుంది.