అమెరికా రాజకీయాల్లో భారత సంతతి ప్రజలు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దేశంలో రెండో అత్యున్నత పదవిని దక్కించుకున్న చరిత్ర ఇండో అమెరికన్లది.
ఇక సెనేటర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, గవర్నర్లుగా ఇతర కీలక పదవుల్లోనూ భారతీయులు కొనసాగుతున్నారు.అటు స్థానిక సంస్థల్లోనూ మేయర్లుగా, కౌన్సిల్ సభ్యులుగా సత్తా చాటుతున్నారు.
తాజాగా న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌లో 32వ జిల్లా నుంచి పోటీ చేస్తున్న భారత సంతికి చెందిన మహిళ ఫెలిసియా సింగ్ కీలక ఎండార్స్‌మెంట్ లభించింది.డెమొక్రాటిక్ నామినీకి సంబంధించి క్వీన్స్‌బరో ప్రెసిడెంట్ డోనోవన్ రిచర్డ్స్ నుంచి ఫెలిసియాకు ఎండార్స్‌మెంట్ దక్కింది.
ఉపాధ్యాయ, మధ్య తరగతి కార్మిక వలసదారుల కుమార్తె అయిన ఫెలిసియా సింగ్.న్యూయార్క్ నగరంలో ఎప్పటి నుంచో నివసిస్తున్నారు.రిపబ్లికన్ల గుప్పిట్లో వున్న క్వీన్స్ సిటీ కౌన్సిల్ సీటును డెమొక్రాట్ల తరపున గెలవాలని ఫెలిసియా భావిస్తున్నారు.ఈ క్రమంలో ఆమెకు మద్ధతుగా 50 మందితో కూడిన ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ నేతలు, కార్మిక సంస్థలు భాగస్వామంగా వున్న ఎండార్స్‌మెంట్ గ్రూపులో తాను చేరుతున్నట్లు రిచర్డ్స్ ప్రకటించారు.32వ కౌన్సిల్ డిస్ట్రిక్ట్‌లోని ఓటర్లకు విద్యా వనరులు, మౌలిక వసతులు, న్యాయమైన కోవిడ్ రికవరీని పెంచేందుకు గాను తమకు నాయకుడు కావాలని రిచర్డ్స్ అన్నారు.ఈ క్రమంలోనే తాను ఫెలిసియాకు మద్ధతు ఇస్తున్నానని ఆయన తెలిపారు.
ఆమె రాజకీయాల కంటే ప్రజల అవసరాలకే పెద్ద పీట వేస్తారని తనకు తెలుసునని రిచర్డ్స్ చెప్పారు.

కాగా, క్వీన్స్‌బరో ప్రెసిడెంట్ డోనోవనన్ రిచర్డ్స్ తనకు మద్ధతు ప్రకటించడం పట్ల ఫెలిసియా సింగ్ హర్షం వ్యక్తం చేశారు.న్యూయార్క్ 32వ జిల్లా కౌన్సిల్ రేసుపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ భారీ అంచనాలున్నాయి.ఇక్కడ నమోదిత డెమొక్రాట్లు ఈ జిల్లాలో రిపబ్లికన్ల కంటే 3-1 కంటే ఎక్కువ మంది వున్నారు.
అయితే ఇక్కడి నుంచి రిపబ్లికన్లే ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం.తాజా సెన్సస్ డేటా ప్రకారం.
క్వీన్స్‌లో ఇండో కరేబియన్, లాటినో, పంజాబీ, బంగ్లాదేశ్ కమ్యూనిటీలలో వృద్ధి నమోదైంది.ఇక్కడి నుంచి ఫెలిసియా ఎంపికైతే జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కుతారు.