పంజాబ్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.లూధియానాలో ప్లాస్టిక్ గోడౌన్ లు భారీగా చెలరేగాయి.
మంటలు భారీగా చుట్టుముట్టడంతో స్థానికంగా ఉన్న ప్రజలు ఇళ్ళల్లో నుండి బయటకు పరుగులు తీశారు.పగలు ఆ ప్రాంతం నిండా కమ్ముకోవడంతో ఒకరిని ఒకరు చూసుకో లేనంత రీతిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఈ మంటలలో భారీగా ప్లాస్టిక్ సామాగ్రి కాలిపోయింది.అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యాలు భావిస్తున్నాయి.ముందుగా ప్లాస్టిక్ సామాగ్రి ఉన్న గోడౌన్ లో మంటలు చెలరేగడం ఆ తర్వాత ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయని.
ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది తెలుపుతున్నారు.ఏది ఏమైనా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లూధియానా ప్లాస్టిక్ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను చాలావరకు అదుపులోకి తీసుకున్నారు.