ప్రపంచాన్ని ఇప్పుడు ఓ దేశం ఆకర్షింస్తోంది.ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అలాంటి దేశంలో ఇప్పుడు జరుగతున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.మొన్నటి వరకు అసలు ఎలాంటి ఘర్షనలు లేకుండానే ఉన్న దేశంలో ఇప్పుడు నిఫ్పుల వర్షం కురుస్తోంది.
అదే ఆఫ్ఘనిస్తాన్.అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎప్పుడైతే అమెరికా తన బలగాలను వెనక్కు తెప్పించుకుందో అప్పటి నుంచే అక్కడ తాలిబన్లకు పట్టు దొరికినట్టు అయింది.కేవలం నెలల గ్యాప్‌లోనే దేశం మొత్తాన్ని తాలిబన్లు ఆక్రమించేశారు.
ఇక ఆ దేశానికి మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ ఘనీ తాలిబన్లకు భయపడి దేశాన్ని విడిచి పారిపోవడం కూడా మనం చూసేశాం.
ఇక తాలిబన్ల పాలన ఎంత అరాచకంగా ఉంటుందో చూసిన జనాలు ఇప్పుడు ఎలాగైనా దేశం విడిచి పారిపోయేందుకు పరుగులు పెడుతున్నారు.ఇక మహా ఘనులే తాలిబన్లకు భయపడి వారిని ఎదురించలేక వేరే దారిచూసుకున్నారు.
ఇంతటి భయానక పరిస్థితుల్లో ఓ వార్త దేశాన్ని చుట్టేస్తోంది.నిజంగా చెప్పాలంటే ఆఫ్గనిస్తాన్‌లో ఇప్పుడు కొత్త పోరాటం మొదలైందని అనిపిస్తోంది.
అయితే ఆ పోరాటం నడిపిస్తోంది ఎవరో కాదండోయ్ అధికారాన్ని కోల్పోయిన ఆ దేశ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలేహ్ చేస్తున్న కొత్త పోరాటమే చారికర్.ఇప్పుడు ఆయన ఒక్కడే తన దగ్గరున్న సైన్యంతో ధైర్యంగా పోరాడుతున్నారు.ఇక ఇప్పటికే సైన్యం ఎంతో ధైర్యంగా పోరాడి కాబూల్ పట్టణానికి ఉత్తరాన ఉన్న పర్వాన్ పోవిన్స్‌లోని చారికర్ ఏరియాను కూఆ తాలిబన్ల నుంచి విడిపించుకుని స్వాధీనం చేసేసుకున్నారంటే వీరి పోరాటం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక అధ్యక్షుడు అష్రఫ్ ఘని కూడా దేశం విడిచి పారిపోలేదని దేశంలోనే ఉన్నాడంటూ మరో సంచలన వార్త ఒకటి బయటకు వచ్చింది.