లొల్లి పెట్టేందుకు రెడీ అవుతున్న గల్లీ రౌడీ

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు.దీంతో ఆయన నటించే ప్రతి చిత్రంపై ప్రేక్షకుల్లో కొంతమేర అంచనాలు క్రియేట్ అవ్వడం, సినిమా రిలీజ్ తరువాత అవి ఆవిరవ్వడం కామన్‌గా మారిపోయింది.

 Sundeep Kishan Gully Rowdy Gets Release Date, Sundeep Kishan, Gully Rowdy, Neha-TeluguStop.com

ఏదేమైనా తాను మాత్రం సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో.ఇక సందీప్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గల్లీ రౌడీ’ ప్రస్తుతం షూటింగ్ పనులన్నీ ముగించుకుంది.

మంచి దర్శకుడిగా పేరున్న జి.నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఆడియెన్స్‌లో ఈ సినిమాపై కొంతమేర అంచనాలు నెలకొన్నాయనే చెప్పాలి.

ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఎప్పుడు వచ్చాయో కూడా కరోనా కాలంలో తెలియకుండా పోయింది.అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

కానీ ఈ సినిమాను థియేటర్లలో వీక్షిస్తేనే బాగుంటుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నాడు.దీంతో ఈ సినిమాను సెప్టెంబర్ 3న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

అయితే టైటిల్ ‘గల్లీ రౌడీ’ కావడంతో ఇదేదో యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం కాదని, పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ అని చెబుతున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు పూర్తిగా నచ్చుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు.

ఇక ఈ సినిమాలో ‘మెహబూబా’ చిత్రం ఫేం బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.తమిళ నటుడు బాబీ సింహా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తు్న్నాడు.

మరి ‘గల్లీ రౌడీ’ థియేటర్లలో ప్రేక్షకులతో లొల్లి పెట్టి్స్తాడా లేడా అనేది సెప్టెంబర్ 3న తేలిపోతుంది.ఒవకేళ ఈ సినిమా సక్సెస్ కొడితే మాత్రం సందీప్ కిషన్ సంతోషానికి హద్దులేకుండా పోతుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube