టాలీవుడ్ హీరోయిన్లతో పోలిస్తే బాలీవుడ్ హీరోయిన్లు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటారనే సంగతి తెలిసిందే.భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వలేక చాలామంది దర్శకనిర్మాతలు సౌత్ ఇండియా హీరోయిన్లనే ఎక్కువగా సినిమాల్లో తీసుకుంటున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలకు ప్రాధాన్యత పెరగడంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, హీరోలు పాన్ ఇండియా హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
సౌత్ ఇండియాలో సత్తా చాటిన బాలీవుడ్ హీరోయిన్ల జాబితాలో అలియా భట్ ఒకరు.
గతంలో పలువురు డైరెక్టర్లు సంప్రదించినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వని అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు.సినిమా రిలీజ్ కాకముందే ఈ బ్యూటీకి సౌత్ ఇండస్ట్రీలో క్రేజ్ పెరుగుతోంది.
సౌత్ లో ఎక్కువ సినిమాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ అనే చెప్పాలి.సౌత్ సినిమాలతోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రోబో సినిమాలో చివరిగా తెలుగులో నటించారు.
తెలుగులో 1 నేనొక్కడినే, దోచెయ్ సినిమాల్లో నటించి సక్సెస్ అందుకోలేకపోయిన కృతిసనన్ ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు.బాలీవుడ్ లో సత్తా చాటుతున్న జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు తెరకు పరిచయం కానున్నారని సమాచారం.రజనీకాంత్ తో లింగా సినిమాలో <కలిసి నటించిన సోనాక్షి సిన్హా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
లైగర్ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇప్పటికే తెలుగులో రెండు సినిమాలు చేయగా చరణ్ శంకర్ కాంబో మూవీలో ఈమె హీరోయిన్ గా నటించనుంది.బ్లాక్ రోజ్ సినిమాతో ఊర్వశి రౌతెలా కూడా సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఇదే సమయంలో పలువురు సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్లు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.