జీవితం ఏమైపోతుందని చాలాసార్లు బాధపడ్డా.. జబర్దస్త్ నరేష్ కీలక వ్యాఖ్యలు?

జబర్దస్త్ షోలో కమెడియన్లుగా, యాంకర్లుగా చేసేవాళ్లకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే జబర్దస్త్ షో కమెడియన్లు, యాంకర్లకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి.

 Jabardasth Naresh Comments In Extra Jabardasth Goes Viral In Social Media, Exra-TeluguStop.com

తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమోలో యాంకర్ రష్మీ రియల్ లైఫ్ లో చోటు చేసుకున్న సంఘటనలను పంచుకోవాలని సూచించగా జబర్దస్త్ కమెడియన్లు తమ జీవితంలోని వేర్వేరు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

జబర్దస్త్ కమెడియన్ నరేష్ తాను ఎత్తు పెరగకపోవడం వల్ల చాలా బాధ పడ్డానని వెల్లడించారు.

నా లైఫ్ ఏమైపోతుందని చాలాసార్లు బాధ పడ్డానని నరేష్ చెప్పుకొచ్చారు.రాకేశ్, భాస్కర్, జీవన్ మాట్లాడుతూ జబర్దస్త్ స్టేజ్ పై ఉండే ప్రతి క్షణం లైఫ్ లో ఆనందకరమైన విషయమని కామెంట్లు చేశారు.

సుధీర్ మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల ట్రావెల్ లో తాను రష్మీ కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం తాను, రష్మీ కలిసి స్క్రిప్ట్ లు వింటున్నామని ఇది తమ జీవితంలో సంతోషకరమైన విషయమని తెలిపారు.ఆ తర్వాత రష్మీ షోలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తను ఉన్నంత వరకు తన బాధ్యత నాదేనని ఫిక్స్ అయ్యానని ఆమె వెల్లడించారు.

ఈ నిర్ణయం విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని రష్మీ చెప్పుకొచ్చారు.లైఫ్ లో తాను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదేనని రష్మీ కామెంట్లు చేశారు.

అయితే రష్మీ ఎవరి గురించి చెప్పిందనే విషయం మాత్రం ప్రోమోలో వెల్లడి కాలేదు.సుధీర్ ప్రోమోలో కట్టప్ప లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం.ఈ నెల 20వ తేదీన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.రాకింగ్ రాకేష్ వకీల్ సాబ్ స్పూఫ్ చేయగా బాహుబలి స్పూఫ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube