చిన్నప్పుడు బాల నటులుగా చేసి.పెద్దయ్యక హీరో, హీరోయిన్లుగా తెరపై దర్శనం ఇస్తే వారిని అంత ఈజీగా గుర్తుపట్టలేం.
ప్రస్తుతం స్టార్ హీరోలు, హీరోయిన్లుగా కొనసాగుతున్న వాళ్లలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా జనాలను ఆకట్టుకున్నవారే ఉన్నారు.వారిలో శ్రీదేవి, రోజా రమణి, మహేష్ బాబు, రాశీ, మీనా, హన్సిక, ఎన్టీఆర్, తమన్నా, తరుణ్ సహా చాలా మంది ఉన్నారు.
అయితే నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు కళ్యాణ్ రామ్ కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు అనే విషయం చాలా మందికి తెలియదు.కానీ నిజం.బాబాయ్ బాలయ్య సినిమాలో నటించాడు.
1989 లో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమా బాలగోపాలుగు.బాలకృష్ణ, సుహాసిని జంటగా నటించిన ఈ సినిమా ద్వారా కల్యాణ్ రామ్ తొలిసారి వెండితెరపై కనిపించాడు.ఇందులో బాలయ్యతో పాటు ఇద్దరు పిల్లలుంటారు.
వారిలో ఒకరు కల్యాణ్ రామ్ కాగా.మరొకరు హాట్ బ్యూటీ రాశీ.
వీరిద్దరూ ఈ సినిమాలో బాల నటులుగా జనాలను బాగా ఆకట్టుకున్నారు.ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.
ఈ పిల్లలు ఇద్దరికి మంచి పేరు కూడా వచ్చింది.

నందమూరి వారబ్బాయి కల్యాణ్ రామ్ పెద్దయ్యాక లక్ష్మీ కల్యాణం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.హరే రామ్, పటాస్ వంటి సినిమాలు చేసి జనాల నుంచి మంచి గుర్తింపు పొందాడు.ఓవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే.
మరోవైపు ప్రొడ్యూసర్ గా మారాడు.జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు.

ఇక బాలయ్య కూతురుగా నటించిన అమ్మాయి 10 సంవత్సరాల తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కృష్ణబాబు చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ నటించింది.తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది.గతంలో బాలయ్య కూతురుగా నటించిన అమ్మాయే ఈ సినిమాలో తనకు జోడీగా నటించడం పట్ల జనాలు అప్పట్లో ఆశ్చర్యపోయారు.నటన పరంగా ఈ సినిమాలో ఇద్దరూ అద్భుతంగా రాణించారు.