సాధారణంగా కొందరికి ముఖం తెల్లగా ఉన్నా మెడ మాత్రం తెల్లగా ఉండదు.ఈ క్రమంలోనే మెడను వైట్‌గా మార్చుకోవడానికి ఖరీదైన క్రీములు, లోషన్లు యూజ్ చేస్తుంటారు.మరికొందరు మేకప్ తో మెడను కవర్ చేసుకుంటుంటారు.కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే.సహజంగానే మెడను తెల్లగా, మృదువుగా మెరిపించుకోవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

డెడ్ స్కిన్ సెల్స్, మురికి పేరుకుపోవడం వల్ల మెడ డార్క్‌గా కనిపిస్తుంది.అందుకే వారానికి ఖచ్చితంగా రెండు సార్లు నెక్ స్క్రబ్ చేసుకోవాలి.అందు కోసం ముందుగా ఒక బౌల్లో రెండు స్పూన్ల టమాటా గుజ్జు, ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి వేళ్లతో మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకోవాలి.
అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే మృతకణాలు, మురికి పోయి.
మెడ తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.
అలాగే వారంలో రెండు, మూడు సార్లు నెక్ ప్యాక్ వేసుకోవాలి.
తద్వారా నలుపు వదిలి మెడ మృదువుగా మారుతుంది.అందుకు ముందుగా ఒక గిన్నె తీసుకుని.
ఇక స్పూన్ పాల మీగడ, చిటికెడు పసుపు మరియు అర స్పూన్ నిమ్మ రసం వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నెక్కు అప్లై చేసి.
ఇరవై, ముప్పై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఈ చిట్కాలతో పాటుగా మెడకు ప్రతి రోజు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.అలాగే డీహైడ్రేషన్ వల్ల కూడా మెడ నల్లగా, డ్రైగా మారుతుంది.అందు వల్ల, నీటిని ఎక్కువగా సేవించాలి.
ఇక బాదం ఆయిల్‌తో రెగ్యులర్‌గా నెక్ మసాజ్ చేసుకుంటే.మెడ మరింత త్వరగా తెల్లబడుతుంది.
మరియు కోమలంగా కూడా మారుతుంది.