వకీల్ సాబ్.ఈ పేరులో పవర్ ఎంత ఉందొ తెలియదు కానీ.
ఈ సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్ కు మాత్రం ఓ రేంజ్ పవర్ ఉందని అందరికి తెలిసిన విషయమే.ఆయన మూడు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మరి ఈ సినిమాతో మళ్ళీ బిగ్ స్క్రీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను కళ్ళకు కట్టినట్టు చూపిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటించారు.అయితే ఈ సినిమా హిందీ మూవీ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.హిందీలో లాయర్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించాడు.

తెలుగులో ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడ్ చేసి ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు.పవన్ మ్యానియాకు తగిన విధంగా కథలో మార్పులు చేసి ఫైట్స్ కూడా జోడించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు.మంచి సందేశంతో తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు తమిళ్ లో కూడా రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు విని పిస్తున్నాయి.

ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో తమిళ ఆడియెన్స్ తో పాటు హిందీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను డబ్బింగ్ కావాలని డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.అందుకే ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ ప్రేక్షకుల కోసం రెడీ చేస్తున్నట్టు టాక్.ఇప్పటికే ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ రైట్స్ ను విజయ్ టివి సొంతం చేసుకుందని తెలుస్తుంది.
ఇప్పటికే డబ్బింగ్ సెన్సార్ కూడా పూర్తి చేశారట.ఇక త్వరలోనే విడుదల అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి వకీల్ సాబ్ అక్కడ కూడా దుమ్ము దులపడానికి రెడీ అయ్యిందన్నమాట.